మీకో దండం నాకేం సంబంధం లేదు

Thu Nov 26 2020 13:20:48 GMT+0530 (IST)

Your punishment has nothing to do with me

బండ్ల గణేష్ గత ఎన్నికల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసి ఇతర పార్టీలపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతారు. కాని బండ్ల గణేష్ లైన్ దాటి మాట్లాడినట్లుగా అనిపించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బండ్ల గణేష్ రాజకీయాల నుండి తప్పుకున్నాడు. అయినా కూడా ఆయన గత వ్యాఖ్యల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆయన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.తన పాత వీడియోలను షేర్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేసిన బండ్ల గణేష్ మళ్లీ మళ్లీ సోషల్ మీడియా ద్వారా తన రాజకీయాల గురించి మాట్లాడాడు. ఇటీవలే తాను ఏ పార్టీలో లేను అంటూ బండ్ల గణేష్ ప్రకటించాడు. అయినా కూడా ఆయన బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ మరోసారి సోషల్ మీడియాలో స్పందించాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం అంటూ దండం పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు. అయినా జనాలు ఊరుకోవడం లేదు. ఆయన గురించి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.