Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ 2' తో పోటీ పడనున్న బాలయ్య..?

By:  Tupaki Desk   |   24 Jun 2021 3:30 AM GMT
కేజీఎఫ్ 2 తో పోటీ పడనున్న బాలయ్య..?
X
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా పలు సినిమాల విడుదలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో ఆ సినిమాలన్నీ కొత్త రిలీజ్ డేట్స్ కోసం చూస్తున్నాయి. మరికొన్ని సినిమాలు రీ షెడ్యూల్ అవుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో బెస్ట్ సీజన్స్ గా భావించే ఇండిపెండెన్స్ వీక్ - వినాయక చవితి - దసరా డేట్స్ కోసం మేకర్స్ పోటీ పడుతున్నారు. 'పుష్ప' చెప్పిన సమయానికి వచ్చే అవకాశం లేదు కాబట్టి.. ఆగస్ట్ 13 లో కర్చీఫ్ వేయడానికి 'లవ్ స్టోరీ' - 'టక్ జగదీష్' సినిమాలు చూస్తున్నాయి.

వినాయక చవితి ఫెస్టివల్ వీక్ కోసం 'అఖండ' 'కేజీఎఫ్ 2' చిత్రాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న 'అఖండ' మే 28న విడుదల కావాల్సి ఉంది. అది మిస్ అవ్వడంతో ఇప్పుడు సెప్టెంబర్ 9 బెస్ట్ రిలీజ్ డేట్ అని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'కేజీఎఫ్: చాప్టర్ 2' చిత్రాన్ని జులై 16న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి రావడం అసాధ్యం. పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర ఇండస్ట్రీల పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగను టార్గెట్ చేయడానికి.. ఇప్పటికే పలు పెద్ద సినిమాలు డేట్స్ బ్లాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టాలీవుడ్ లో 'ఆచార్య' 'పుష్ప' వంటి సినిమాలు ఆ డేట్ కోసం చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని వినాయక చవితికి తీసుకురావాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక జరిగితే పాన్ ఇండియా 'కేజీఎఫ్ 2' తో బాలయ్య 'అఖండ' పోటీ పడే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ రానుంది.