'భీష్మావతారం'లో బాలయ్య స్పెషల్ ట్రీట్.. ఫ్యాన్స్ కోసమేనట!

Tue Feb 23 2021 17:08:52 GMT+0530 (IST)

Balayya special treat in 'Bhishmavataram' for fans!

నటసింహం నందమూరి బాలయ్య భీష్మ భీష్మ పితామహ అవతారంలో దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజు 'భీష్మ ఏకాదశి' ఈ సందర్బంగా బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు (ఎన్టీఆర్ బయోపిక్) నుండి ఆనాటి భీష్మాచార్యుని గెటప్ లో బాలయ్య పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటివరకు భీష్మ అవతారంలో బాలయ్య లుక్ ప్రేక్షకులు చూడలేదు. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడానికి కూడా బాలకృష్ణ కారణం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భీష్ముని పాత్ర నాకు ఎంతో ఇష్టమైన పాత్రలలో ఒకటి. నా తండ్రి ఎన్టీఆర్ గారు అప్పట్లో ఆయన వయసుకు మించిన 'భీష్మా' పాత్రను పోషించారు. అలాగే ఆయన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నాన్నగారి సినిమాలలో భీష్మా క్యారెక్టర్ చాలా ఇష్టం. అందుకే బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో 'భీష్మా' పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాము. భీష్మాచార్యగా నేను నటించడం జరిగింది. కానీ సినిమా లెన్త్ ప్రాబ్లెమ్ కారణంగా ఆ సన్నివేశాలను ఫైనల్ కట్ నుండి తీసేయాల్సి వచ్చింది. ఈరోజు భీష్మా ఏకాదశి.. అందుకే ఆ ఫోటోలను నా అభిమానులు  ప్రేక్షకులతో పంచుకోవాలనుకున్నాను" అని బాలయ్య తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమాలో బాలయ్య సరసన కంచె ఫేమ్ ప్రగ్యాజైస్వాల్ నటిస్తుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.