మందు బాబుల కోసం బాలయ్య స్పెషల్ పద్యం

Mon Jan 17 2022 10:10:07 GMT+0530 (India Standard Time)

Balayya special poem for drug addicts

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. `అఖండ` బ్లాక్ బస్టర్ తరువాత ఆయన ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. వరుస సినిమాలని లైన్ లో పెట్టిన ఆయన ఇటీవల సంక్రాంతి సంబరాలని తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి స్వగ్రామం అయిన ప్రకాశం జిల్లా కారచేడులో జరుపుకున్నారు. గుర్రం స్వారీ చేస్తూ.. బీచ్ లో జీప్ పై విహరిస్తూ  అక్కడి వాతావరనాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతిని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. బాలయ్య సంక్రాంతి సంబరాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇదిలా వుంటే `ఆహా` ఓటీటి కోసం బాలకృష్ణ హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకె` పేరుతో టాక్ షోని చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీలతో బాలయ్య చేస్తున్న హంగామా ఓ రేంజ్ లో వైరల్ గా మారి ట్రెండ్ అవుతోంది. వెండితెరపైనే కాదు హోస్ట్ గానూ తన స్టైలే వేరంటూ బాలయ్య అందరికి సవాల్ విసురుతున్నారు. తాజాగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` టాక్ షో వేదికగా బాలయ్య మందు బాబుల కోసం చెప్పిన పద్యం వైరల్ గా మారింది.

గతంలో `పైసా వసూల్ ` మూవీలో బాలయ్య పాడిన `ఏయ్ మావా ఎక్ పెగ్ లా...` ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా దాన్ని మించి పోయేలా మందు బాబుల కోసం బాలయ్య చెప్పిన పద్యం మరింత వైరల్ అవుతోంది. అంతే కాకుండా గుక్కతిప్పుకోకుండా బాలయ్య చెప్పిన ఈ పద్యం విన్న వారంతా షాకవుతున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా `లైగర్` టీమ్ `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి`లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ పండగ సందర్బంగా ఆహాలో స్ట్రీమింగ్ అయింది.

సంక్రాంతి స్పెషల్ గా రూపొందించిన ఈ ఎపిసోడ్ లో `లైగర్`డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ చార్మి సందడి చేశారు. బాలయ్యతో కలిసి సరదగా ముచ్చట్లతో ఎంజాయ్ చేశారు. `లైగర్` మూవీ ఆసక్తికర విషయాలు షూటింగ్ సంగతులతో పాటు తమ తమ వ్యక్తిగత విషయాలపై `లైగర్` టీమ్ ఓపెన్ అయింది. బాలయ్య ఓపెన్ అయ్యేలా చేశారు. ఈ సంగతులు మరింత ఆసక్తికరంగా సాగాయి.

అయితే ఇదే సందర్భంగా తనదైన స్టైల్లో బాలకృష్ణ మందు బాబుల కోసం ఓ పద్యం వదిలారు. గుక్కతిన్నుకోకుండా ఎలాంటి తడబాటు లేకుండా బాలయ్య చెప్పిన మందు పద్యం వింటూ పూరి జగన్నాథ్ షాకయ్యాడు. ప్రస్తుతం `ఓ సారా దేవా.. నీవు బీరువై బ్రాందీవై వస్కీవై.. .జిన్నువై రమ్మువై.. కాక్టైల్ వై.. గుడుంబావై.. అంటూ అన్ స్టాపబుల్ గా చెప్పిన మద్యం పద్యం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా బాలయ్యా మజాకా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.