Begin typing your search above and press return to search.

బాలయ్య బర్త్‌ డే స్పెషల్‌ ఏమీ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 7:15 AM GMT
బాలయ్య బర్త్‌ డే స్పెషల్‌ ఏమీ లేనట్లేనా?
X
బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రాబోతున్న మూడవ సినిమాతో హ్యాట్రిక్‌ ఖాయం అంటూ ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. సింహా.. లెజెండ్‌ చిత్రాలను మించి ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో అంతా ఎదురు చూస్తున్నారు. సినిమాను చకచక పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించగా ఈ విపత్తు తలెత్తడంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. గత మూడు నెలలుగా పూర్తిగా షూటింగ్‌ ఆగిపోయింది. ఈ సమయంలో బాలయ్య పుట్టిన రోజు స్పెషల్‌ పోస్టర్‌ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈనెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్బంగా బాలయ్య ఫస్ట్‌ లుక్‌ ను బోయపాటి విడుదల చేయాలనుకున్నాడు. ఇప్పటి వరకు పూర్తి అయిన షూట్‌ నుండే బాలయ్య లుక్‌ ను రివీల్‌ చేయాలని అనుకున్నాడట. పోస్టర్‌ లో బాలయ్య రెండు విభిన్న లుక్స్‌ ను కూడా రివీల్‌ చేయాలని భావించాడట. కాని అందుకు బాలయ్య నో చెప్పాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయడం కరెక్ట్‌ కాదని ఆయన భావిస్తున్నాడట.

ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్‌ తో జరిగిన సినీ ప్రముఖుల భేటీ గురించి బాలకృష్ణ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆ విమర్శల నేపథ్యంలో కొందరు కావాలని ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పై బ్యాడ్‌ ప్రచారం కూడా చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అందుకే బాలయ్య ప్రస్తుతానికి ఫస్ట్‌ లుక్‌ వద్దని బోయపాటికి సూచించి ఉంటాడనేది కొందరు వాదన. మొత్తానికి బాలయ్య పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్‌ కు నిరాశ తప్పదేమో అంటూ నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.