బాలయ్య టాక్ షో సీజన్ 2 పై 'అఖండ' ప్రభావం

Fri Jan 28 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Balayya Increased His Remuneration

నందమూరి బాలకృష్ణ కు 2021 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ఆ ఏడాదిలోనే ఆహా లో అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ షో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా భారీ వ్యూస్ ను వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకుంది. రికార్డు బ్రేకింగ్ లో షో కు రేటింగ్ కూడా దక్కింది. అందుకే 2021 లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ నిలిచింది. మొదటి ఎపిసోడ్ మొదలుకుని త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న మహేష్ బాబు ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ గానే నిలిచింది అనడంలో సందేహం లేదు. అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 పై అప్పుడే అంచనాలు ఊహాగాణాలు పెరుగుతున్నాయి. ఇక బాలయ్య 2021 లో అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఎప్పుడు దక్కని రికార్డులు బాలయ్యకు అఖండ సినిమా ద్వారా దక్కాయి. ఏకంగా 200 కోట్ల మార్క్ ను అఖండ చేరుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక 100 కు పైగా థియేటర్లలో 50 రోజులను అఖండ పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును కూడా నమోదు చేయడం జరిగింది.అఖండ సినిమా ఘన విజయంతో బాలయ్య తన పారితోషికంను భారీగా పెంచాడనే వార్తలు వస్తున్నాయి. సాదారణంగా ఒక సినిమాకు మరో సినిమాకు పారితోషికం వ్యత్యాసం ఉంటుంది. అలాంటిది ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత చేయబోతున్న సినిమా కు తీసుకునే పారితోషికం ఖచ్చితంగా భారీగా ఉంటుంది. అఖండ సినిమా భారీ విజయం సాధించిన కారణంగా ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కు కూడా భారీ గా పారితోషికంను ఆయన పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీజన్ 1 ను ముగించబోతున్నట్లుగా ప్రకటించారు. సీజన్ 2 ను ఎప్పుడు ప్రారంభించేది క్లారిటీ లేదు. కాని గత సీజన్ ను ప్రారంభించినట్లుగానే ఏడాది చివర్లోనే మొదలు పెట్టే అవకాశం ఉంది. లేదంటే ఒకటి రెండు నెలలు ముందుగానే అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోనే స్ట్రీమింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. సీజన్ 2 లో మరింత మంది ప్రముఖ స్టార్స్ ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని ఇతర స్టార్స్ ను కూడా అన్ స్టాపబుల్ లో తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మరింత రిచ్ గా విభిన్నంగా ఉంటుంది. కనుక ఎలాంటి డౌట్ లేకుండా భారీగా రేటింగ్ ను కూడా దక్కించుకనే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ స్టాపబుల్ కు వస్తున్న రెస్పాన్స్ తో పాటు అఖండ సినిమా తో తనకు దక్కిన క్రేజ్ తో షో సీజన్ 2 కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బాలయ్య మొదటి సీజన్ లో ఒక్కో ఎపిసోడ్ కు తీసుకున్న పారితోషికంతో పోల్చితే దాదాపుగా 25 నుండి 30 శాతం అదనంగా పారితోషికంను తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రికార్డు స్థాయిలో ఒక్కో ఎపిసోడ్ కు బాలయ్య తీసుకోబోతున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆహా కూడా అన్ స్టాపబుల్ ను మరింత మంది చూసే విధంగా వ్యూహాత్మకంగా షో ను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అరవింద్ షో  సీజన్ 2 కు మరింత ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.