Begin typing your search above and press return to search.

ఒకేరోజు బాలయ్య 2 సినిమాలు.. పండగే!

By:  Tupaki Desk   |   26 May 2023 1:27 PM GMT
ఒకేరోజు బాలయ్య 2 సినిమాలు.. పండగే!
X
'రీ రిలీజ్.. రీ రిలీజ్.. రీ రిలీజ్' ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోన్న సౌండ్ ఇది. అంతలా గతంలో వచ్చి హిట్ అయిన స్టార్ హీరోల కు సంబంధించిన చాలా చిత్రాలను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. వీటికి ఇప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఇదే ట్రెండ్‌ను హీరోల అభిమానులు కంటిన్యూ చేస్తూనే వెళ్తున్నారు.

ఇప్పటికే తెలుగులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన క్లాసిక్ చిత్రాలు రీ రిలీజ్ అయి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు అదే బాటలో నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలు కూడా మరోసారి తెర పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్లు తాజాగా సమాచారం బయటకు వచ్చింది.

జూన్ పదవ తేదీన నటసింహా నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లో క్లాసిక్ హిట్ అయిన 'భైరవ ద్వీపం' చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన 4K టెక్నాలజీ వర్క్ జరుగుతోంది. ఇది పూర్తైన వెంటనే ట్రైలర్‌ ను వదిలి.. అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది.

బాలయ్య పుట్టినరోజు ను పురస్కరించుకుని ఆయన నటించిన మరో సంచలన హిట్ మూవీ 'నరసింహనాయడు' కూడా రీ రిలీజ్ అవుతున్నట్లు తాజాగా తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా 4K టెక్నాలజీ వర్క్ కూడా జెట్ స్పీడుతో జరుగుతోన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ ను కూడా రిలీజ్ చేస్తారని అంటున్నారు. దీన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటి వరకూ టాలీవుడ్‌ లోని చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ, ఒకే హీరోకు సంబంధించిన రెండు చిత్రాలు మాత్రం ఒకేసారి రాలేదు. అయితే, ఇప్పుడు ఆ రికార్డు ను నందమూరి బాలకృష్ణ 'భైరవ ద్వీపం', 'నరసింహనాయుడు' చిత్రాలతో క్రియేట్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక, ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారని చెప్పొచ్చు.