Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యని పట్టించుకోవడం లేదా...?

By:  Tupaki Desk   |   28 May 2020 7:50 AM GMT
సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యని పట్టించుకోవడం లేదా...?
X
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుమారుడు హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సతీమణి వసుంధర దేవితో కలిసి ఘాట్ కి చేరుకున్న ఆయన తండ్రి సమాధి పై పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఇటీవల తెలంగాణా ప్రభుత్వంతో టాలీవుడ్ సినీ పెద్దల సమావేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య మాట్లాడుతూ సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని.. పత్రికలు మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా కష్టాలు పడుతోందని.. అందువలన షూటింగ్‌ లు త్వరలోనే ప్రారంభమైతే మంచిదన్నారు. అంతేకాకుండా సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలకు లోబడి షూటింగ్‌ లు జరుపుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

మే 22న సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు పలువురు సినీ రంగ ప్రముఖులు తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో సమావేశమైన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌ లు.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్.. సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఆగిపోయిన సినిమా షూటింగ్‌ లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, సురేశ్‌ బాబు, మెహర్‌ రమేశ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి.కల్యాణ్‌, కొరటాల శివ, త్రివిక్రమ్‌, జెమిని కిరణ్‌, ప్రవీణ్‌ బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ఇంతమంది సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమ ఎదురుకుంటున్న కష్టాలపై చర్చిస్తున్న నేపథ్యంలో దీని పై బాలయ్యకు సమాచారం లేకపోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం బాలయ్యకు నిజంగానే సమాచారం ఇవ్వలేదా..? లేక కావాలనే బాలయ్యను పక్కన పెట్టారా అనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున సారధ్యం వహిస్తూ ఇంతకముందు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలిశారు. అప్పుడు కూడా బాలయ్య కనిపించలేదు. ఈ నేపథ్యంలో బాలయ్యని కావాలనే పక్కన పెడుతున్నారెమో అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.