Begin typing your search above and press return to search.

కొత్త తెలుగు బిగ్‌ బాస్‌ వారిద్దరిలో ఒకరు

By:  Tupaki Desk   |   21 Dec 2022 1:30 AM GMT
కొత్త తెలుగు బిగ్‌ బాస్‌ వారిద్దరిలో ఒకరు
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 తాజాగా ముగిసిన విషయం తెల్సిందే. రేవంత్ ట్రోఫీ గెలవగా శ్రీహాన్‌ మనీ గెలిచాడు. ఈ సీజన్ పై మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి. చివరకు ఫైనల్‌ ఎపిసోడ్‌ పై కూడా చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే బిగ్‌ బాస్ కు కొత్త హోస్ట్‌ రాబోతున్నాడనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

సీజన్ 3 నుండి మొదలుకుని సీజన్ 6 వరకు నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించాడు. మధ్య లో ఒక ఓటీటీ సీజన్ కు కూడా హోస్ట్‌ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. మొత్తంగా అయిదు సీజన్ లకు నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించాడు. ఇప్పుడు కొత్త సీజన్ కు ఆయన హోస్టింగ్‌ చేసేందుకు ఆసక్తిగా లేడు అనే వార్తలు వస్తున్నాయి.

స్టార్‌ మా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌ బాస్ కొత్త సీజన్ లకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆహా లో అన్‌ స్టాపబుల్‌ తో రచ్చ చేస్తున్న బాలయ్య ను బిగ్‌ బాస్ కి హోస్ట్‌ గా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే చర్చ జరిపినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ తో పాటు రానా కూడా బిగ్‌ బాస్ కొత్త సీజన్ లకు హోస్ట్‌ గా పరిశీలింపబడుతున్నాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. వీరిద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరు బిగ్‌ బాస్ కొత్త సీజన్ ల కోసం హోస్ట్‌ గా వ్యవహరించే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

రానా మరియు బాలకృష్ణ లు ఇద్దరు కూడా టాక్ షో లకు హోస్ట్‌ లుగా వ్యవహరించారు. కనుక వీరిద్దరిలో ఎవరు కొత్త బిగ్ బాస్ అయినా కూడా సక్సెస్ అవ్వడం ఖాయం అనే నమ్మకంను స్టార్‌ మా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు బిగ్‌ బాస్‌ స్టేజ్ ఎక్కుతారు అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.