నాలుగు పిల్లర్లలో ఒకరు.. గుర్తించరా?

Fri May 29 2020 20:00:31 GMT+0530 (IST)

One of the four Pillers .. Not identified?

సినీ పరిశ్రమ తరఫున తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి వెళ్ళిన వారు తనను పిలవలేదని చెప్పడం.. తర్వాత వారిపై ఘాటు వ్యాఖ్యలు చెయ్యడంతో నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత నాగబాబు సీన్లోకి ఎంటర్ కావడంతో ఇదో పెద్ద వివాదంగా మారిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇక నందమూరి అభిమానులు ఈ విషయంలో బాలయ్యపై విమర్శలు చేసేవారిని చాలా విషయాల్లో ప్రశ్నిస్తున్నారు. బాలయ్య మునుపటి తరం హీరోలలో నాలుగు పిల్లర్లుగా పిలుచుకునే చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ లలో ఒకరని.. పైగా నందమూరి ఫ్యామిలీకి ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ప్రతినిధి అని అలాంటి వ్యక్తిని ఎలా పక్కన పెడతారని ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి స్టార్ హీరో అయినా ఏదో ఒక సందర్భంలో ఓ ఏడాది పాటు గ్యాప్ తీసుకుంటారని.. కానీ బాలయ్య మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వడని.. స్టార్ హీరోలు గాప్ ఇవ్వకుండా పనిచేస్తూ ఉంటే ఎక్కువమంది సినీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని భావించే వ్యక్తి అని అంటున్నారు. సినిమాలు ఫ్లాప్.. హిట్లతో సంబంధం లేకుండా.. పరిశ్రమ క్షేమం కోసం వరసగా సినిమాలు చేస్తూ ఉంటారని.. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలు చేయడం మానరని.. అలాంటి వ్యక్తిని గుర్తించకపోతే అప్సెట్ అవ్వరా.. అందులో తప్పేముంది అంటున్నారు.

బాలయ్య లాంటి కీలకమైన వ్యక్తిని ఇలాంటి ముఖ్యమైన పనులలో సంప్రదించకపోవడం.. కనీసం విషయం అయినా తెలియజేయక పోవడం సరికాదని.. ఈ పరిణామం తమకు బాధ కలిగించిందని.. ఇకపై అయినా బాలయ్య ప్రాముఖ్యత గుర్తించాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు.