Begin typing your search above and press return to search.

బాలకృష్ణ సినిమా పై ఫ్యాన్స్ అసంతృప్తి..!

By:  Tupaki Desk   |   9 Dec 2022 9:30 AM GMT
బాలకృష్ణ సినిమా పై ఫ్యాన్స్ అసంతృప్తి..!
X
నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం వీర సింహారెడ్డి పూర్తి చేసే పనుల్లో ఉన్న బాలయ్య బాబు అది పూర్తి కాకుండానే అనీల్ రావిపుడి మూవీ లైన్ లో పెట్టాడు. గురువారం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అనీల్ మార్క్ ఎంటర్టైనర్ తో పాటుగా బాలకృష్ణ మార్క్ మాస్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ స్వామి రామానుజాచార్య జీవిత కథతో సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య తెలుగు తెర మీద ఆధ్యాత్మిక కథలను ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది.

అదీగాక ఈమధ్య ఇండియన్ తెర మీద ఆధ్యాత్మిక కథలకు మంచి క్రేజ్ ఏర్పడటంతో అలాంటి సినిమాలు చేయాలని స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరు ఓకే కానీ బాలకృష్ణ రామానుజాచార్య సినిమా అనేసరికి మాత్రం ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

మాస్ హీరో అయిన బాలకృష్ణకు అలాంటి సినిమాలు అసలు సూట్ అవ్వవని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మా బాలయ్య మాస్ సినిమాలు చేసి మమ్మల్ని అలరిస్తే చాలు పెద్ద ప్రయోగాలు ఏవి అవసరం లేదని అంటున్నారు ఫ్యాన్స్.

అదీగాక ఆ సినిమా నిర్మాత సి కళ్యాణ్ అనేసరికి ఫ్యాన్స్ లో మరింత కంగారు పడుతున్నారు. ఆయనతో తీసిన సినిమాలన్ని పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. అందుకే బాలకృష్ణ ఈ మూవీ ఆలోచనని పక్కన పెట్టేస్తే బెటర్ అని అంటున్నారు. అయితే బాలయ్య ఏదైనా చేయాలని అనుకుంటే మాత్రం అది సాధించే వరకు ఊరుకోడు. మరి ఆయన గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ ఎన్ని చెప్పినా సరే పక్కా మూవీ చేస్తాడని చెప్పొచ్చు.

అంతకుముందు పాండురంగ మహత్యం అనే ఒక ప్రయత్నాన్ని చేసిన బాలకృష్ణ ఆ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో తెలిసిందే. అయితే రామానుజాచార్య జీవిత కథ తీస్తే కచ్చితంగా ఆధ్యాత్మిక ప్రేక్షకులను అలరించేలా చేస్తారట. అయితే ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు..? సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.