'సైరా' టీమ్ కి బాలయ్య సర్ ప్రైజ్ ట్రీట్

Thu Oct 10 2019 11:35:32 GMT+0530 (IST)

Balakrishna and Venkatesh Attend for Sye Raa Success Party

పరిశ్రమలో ఒక్కోసారి ఊహాతీతమైన సర్ ప్రైజ్ లు ఉంటాయి. అప్పటికప్పుడే ఈగోలు-మనస్ఫర్థలు- డామినేషన్ లు వగైరా వగైరా కనిపిస్తుంటాయి.  స్టార్ల మధ్య డాబు దర్పం ఒకరితో ఒకిరికి పోటాపోటీ కనిపిస్తుంటుంది. అయితే అంతలోనే ఏదైనా సకార్యానికి కలిసికట్టుగా భుజంభుజం రాసుకునేందుకు రెడీ అవుతుంటారు. పరిశ్రమ బాగు కోసం.. అభివృద్ధి కోసం .. ఏదైనా ప్రకృతి విపత్తు వేళ అంతా కలిసి కట్టుగా సాయానికి ముందుకొస్తుంటారు. అదంతా ఒకెత్తు అనుకుంటే ఒకరి సినిమా సక్సెసయితే ఇంకొకరు అభినందించుకోవడం.. పోటీ హీరో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం అన్న గొప్ప సంస్కృతిని టాలీవుడ్ లోనే మొదలైంది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` గ్రాండ్ సక్సెస్ పార్టీలో నటసింహా నందమూరి బాలకృష్ణ చేసిన సందడి ఫిలిం వర్గాల్లో చర్చకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు కొణిదెల టీమ్ ని.. దర్శకుడు సురేందర్ రెడ్డిని ఆయన అభినందించారు. శుభాకాంక్షలు తెలిపి సరదాగా టైమ్ స్పెండ్ చేసి డిన్నర్ పార్టీని ఆస్వాధించారు. అందుకు కొణిదెల కాంపౌండ్ చాలా సంతోషించింది. గత ఎన్నికల వేళ పొలిటికల్ గా మెగా - నందమూరి వార్ నడిచినా.. అసలు అవేవీ నేటి ఈ ఉత్సవానికి అడ్డు కాదని ప్రూవైంది. ఎన్బీకే-నాగబాబు పొలిటికల్ వార్-కామెంట్లు అవన్నీ అప్పటికే పరిమితమని ప్రూవైంది. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు! అని నిరూపించింది ఈ ఘటన. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఇచ్చిన సక్సెస్ పార్టీ ఇది. అందుకే ఈ పార్టీలో అగ్ర కథానాయకులు.. సీనియర్ సెలబ్రిటీలు పలువురు కనిపించారు.

హైదరాబాద్ పార్క్ హయత్ లో జరిగిన ఈ వేడుకలో బాలయ్యతో పాటు విక్టరీ వెంకటేష్- కృష్ణంరాజు సందడి చేశారు. చిరంజీవి- రామ్ చరణ్- సురేందర్ రెడ్డి- తమన్నా సైరా కోసం చేసిన శ్రమను.. సాహసాన్ని గుర్తుచేసుకున్నారు. టి.సుబ్బరామి రెడ్డి- మురళి మోహన్-అల్లు అరవింద్- శ్యామ్ ప్రసాద్ రెడ్డి- దిల్ రాజు- రఘురామ కృష్ణంరాజు తదితరులు సక్సెస్ పార్టీకి హాజరయ్యారు.