Begin typing your search above and press return to search.

నర్సుల వివాదంపై బాలయ్య రియాక్షన్

By:  Tupaki Desk   |   6 Feb 2023 1:37 PM GMT
నర్సుల వివాదంపై బాలయ్య రియాక్షన్
X
ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసిన బాలయ్య బాబు అన్ స్టాపబుల్ విత్ పవన్ కల్యాణ్ ఇటీవలే విడుదలైంది. ఈ ఏపిసోడ్ లో బాలయ్య బాబు నర్సుల గురించి అసహ్యంగా మాట్లాడారని పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలంటూ... నర్సుల అందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ తెగ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై బాలయ్య బాబు స్పందించారు.

ఓ లేఖ ద్వారా తాను మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇచ్చారు. కావాలనే తనపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని... నర్సులను కించపరిచానంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను కావాలనే వక్రీకరించారని వివరించారు.

రోగులకు సేవలు అందించే తన సోదరీమణులు అంటే తనకెంతో గౌరవం అని ప్రకటించారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పుకొచ్చారు. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని వివరించారు.

అయితే ఆ నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని వివరించారు. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారని స్పష్టం చేశారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలన్నారు. నిజంగా తన మాటలు వారి మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు.

ఇదొక్కటే కాకుండా ఇటీవలే బాలకృష్ణ చాలా వివాదాల్లోనే ఇరుక్కున్నారు. వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ కి ముందు దేవ బ్రాహ్మణుల దేవుడు రావణాసురుడు అంటూ కామెంట్ చేసిన ఆయన తర్వాత క్షమాపణలు కూడా చెబుతూ లేఖ విడుదల చేశారు.

ఆ తర్వాత అదే సినిమా సక్సెస్ మీట్ లో అక్కినేని, తొక్కినేని అంటూ కామెంట్లు చేయడంతో పెద్ద వివాదం రేగింది. అదే విధంగా రంగారావుని ఆ రంగారావు, ఈ రంగారావు అని అవమానించారంటూ కాపునాడు అనే సంస్థ కూడా అల్టిమేటం జారీ చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.