ఫోటో స్టోరీ : టిడిపి చిత్రశిల్పి

Mon Dec 10 2018 12:36:01 GMT+0530 (IST)

Balakrishna NTR Rajarshi Second Single Announcement Poster

స్వర్గీయ నందమూరి తారకరామారావు కథ ఆధారంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ మెల్లగా పీక్స్ కు చేరుకుంటోంది. ఇటీవలే విడుదల చేసిన కథానాయకుడు టైటిల్ ట్రాక్ మంచి స్పందన దక్కించుకుంది.శివశక్తి దత్తా గంభీరమైన సాహిత్యానికి కీరవాణి ట్యూన్ అద్భుతంగా జత కట్టడంతో మొదటి అడుగు విజయవంతంగా పూర్తయ్యింది. ఇక రెండోది ఇవాళ సాయంత్రం 4 గంటల 21 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.రాజర్షి పేరుతో సాగే ఈ పాట మహానాయకుడులోది కావొచ్చు. కారణం పోస్టర్ లో బాలకృష్ణ తన స్వహస్తాలతో తెలుగుదేశం పార్టీ లోగోని స్వయంగా చిత్రీకరిస్తున్నట్టు ఉండటమే. రూపం పూర్తిగా లేకపోయినా బాలయ్య చేతిలో కుంచె ద్వారా గోడ మీద వచ్చిన షేప్ నాగలి రూపంలో ఉండటంతో  ఇది టిడిపి లోగో అని అర్థమవుతోంది. అయితే ఇది జనవరి 9న వచ్చే కథానాయకుడు క్లైమాక్స్ లో ఉంటుందా లేక మహానాయకుడు టైటిల్ సాంగ్ గా దీన్ని కంపోజ్ చేసారా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. మొన్నో ఇంటర్వ్యూలో శివశక్తి దత్తా చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇది మహానాయకుడి టైటిల్ సాంగ్ అయ్యుండే అవకాశం ఉంది.

ఇదీ ఆయనే రాసారని చెప్పారు. సో ఈ సస్పెన్స్ అంతా 4.21కి వీగిపోతుంది. టైం నిమిషాల్లో చూసుకుని సెట్ చేస్తున్నారంటే బాలకృష్ణ ముహూర్తానికి ఇస్తున్న ప్రాధాన్యత అర్థమైపోతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్ రెండు భాగాల్లో మొదటిది కథానాయకుడు జనవరి 9న విడుదల కానుండగా మహానాయకుడి డేట్ మరో సారి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. మూడో వారంలో ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి