వీడియో : మన ఎన్టీఆర్.. బాలయ్య మాటకు ఫ్యాన్స్ కేకలు

Sun Nov 28 2021 10:06:48 GMT+0530 (IST)

Balakrishna In Akhanda Pre Release Event

నందమూరి అభిమానులు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ లు ఒకే స్టేజ్ పై ఉంటే చూడాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా బాబాయి అబ్బాయి కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు కూడా బాలయ్య మరియు ఎన్టీఆర్ ను కలిసి ఉన్నప్పుడు చూస్తే అలా కొన్ని సెకన్లు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరి కలయిక చాలా స్పెషల్. వీరిద్దరు ఒకరికి గురించి ఒకరు మాట్లాడినా కూడా ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా వైరల్ అవుతాయి. తాజాగా అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య ఎన్టీఆర్ పేరు ను ఎత్తడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. బాలయ్య నోటి నుండి ఎన్టీఆర్ పేరు రావడమే సంతోషకర విషయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇండస్ట్రీలో వరుసగా రాబోతున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని.. సినిమా పరిశ్రమ మళ్లీ పుంజుకోవాలన్నట్లుగా బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లడాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు 'మన ఎన్టీఆర్' నటించిన సినిమా ఇంకా చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ బాలయ్య శుభాకాంక్షలను తెలియజేశాడు. బాలయ్య మన ఎన్టీఆర్ అంటూ మాట్లాడిన మాటలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మన ఎన్టీఆర్ అనే పదం బాలయ్య నోటి నుండి వచ్చిన వెంటనే శిల్ప కళా వేదికలో ఉన్న అందరు కూడా గట్టిగా అరిచారు. ఫ్యాన్స్ కేకలతో ఆడిటోరియం దద్దరిల్లింది అనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంటాడని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆయన పారిస్ కు వెళ్లడం వల్ల అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొనలేదు. ఇప్పుడు కాకున్నా అఖండ విడుదల వరకు అయినా ఎన్టీఆర్ స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అఖండ సూపర్ హిట్ అయ్యి థ్యాంక్స్ మీట్ లేదా సక్సెస్ సెలబ్రేషన్ అయినా జరిగితే ఎన్టీఆర్ హాజరు అవుతాడేమో చూడాలి. ఎన్టీఆర్ మరియు బాలయ్య లను ఆ సమయంలోనే ఒకే స్టేజ్ పై చూసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు నందమూరి అభిమానులు మన ఎన్టీఆర్ వీడియోను షేర్ చేస్తూనే ఉంటారు. అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలు ఎంత వరకు ఈ సినిమా రీచ్ అవుతుందో చూడాలి.

https://twitter.com/Nandamurifans/status/1464644928504426505