వాళ్లని టెన్షన్ లో పడేసిన బాలయ్య

Fri Mar 31 2023 16:07:14 GMT+0530 (India Standard Time)

Balakrishna Film Making Tension For Them

నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి అన్ స్టాపబుల్ విత్ NBK వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడితో కలిసి NBK 108వ సినిమా చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈ కాంబినేషన్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ ఫేమ్ సాహు గారపాటి - హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.



దసరాకి NBK108 రాబోతుంది అంటూ తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  దసరా పండుగకు సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్న మేకర్స్ ఎట్టకేలకు దసరా 2023కి లాక్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో పవర్ డైలాగ్లను పలుకుతారని అది అభిమానులకు భారీ ట్రీట్గా ఉంటుందని భావిస్తున్నారు.

బాలయ్య మునుపెన్నడూ చూడని పాత్రలో లుక్లో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం చేస్తున్నాడు  అనిల్ రావిపూడి. ఇప్పటికే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అభిమానులను థ్రిల్ చేశాడు కూడా.  NBK 108 చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరయిన్గా  శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి అయితే దసరాకి సినిమా విడుదల చేస్తున్నామని చెప్పారు కానీ డేట్ ఫిక్స్ చేయలేదు. NBK 108 అక్టోబర్ 19 లేదా అక్టోబర్ 21 తేదీలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అని విశ్వసనీయంగా తెలిసింది.  

ఇదంతా ఒక ఎత్తు అయితే బోయపాటి శ్రీను రామ్ పోతినేని సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.  రవితేజ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు కూడా దసరాకే రిలీజ్ కాబోతోంది.

సంక్రాంతి తర్వాత దసరాకి కాస్త మార్కెట్ ఉంటుంది కానీ ఇలా మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఒకేసారి వస్తే ఖచ్చితంగా అది కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే రవితేజ రామ్ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ రాబోతున్నాయి. ఈ నేపద్యంలో వీరిద్దరూ ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా అని చర్చ కూడా మొదలైంది. ఎవరో ఒకరు తగ్గకపోతే.. కలెక్షన్ల మీద ప్రభావం కచ్చితంగా పడుతుందని అంటున్నారు.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.