Begin typing your search above and press return to search.

బాలయ్య తో పెనవేసుకున్న బంధం

By:  Tupaki Desk   |   26 Nov 2021 1:30 PM GMT
బాలయ్య తో పెనవేసుకున్న  బంధం
X
టాలీవుడ్ ఒక పెద్ద కుటుంబం. ఎన్నో ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. ఎవరి టాలెంట్ వారిదే. ఇక్కడ వారసత్వానికి పెద్ద పీట అంటారు. కానీ అది నిజం కాదు, ఎవరైనా కష్టపడితేనే ప్రజల దీవెనలు నిండుగా లభిస్తాయి. అలా టాలీవుడ్ లో బాలయ్య తన తండ్రి ఎన్టీయార్ వారసుడిగా పరిచయం అయినా తనకంటూ సొంత స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్నారు. బాలయ్యను అంతా బోళా మనిషి అంటారు. అది నిజం. ఆయన మంచితనం పాళ్ళు ఎంత అన్నవి దగ్గరగా చూస్తేనే కానీ అర్ధం కాదు.

అలాంటి బాలయ్య ఇపుడు టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబం అయిన అల్లు అరవింద్ తో బంధం కలిపారు. అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా వస్తున్నారు. ఇప్పటికి రెండు షోలు జరిగాయి. అవి అదరగొట్టాయి. ఇదిలా ఉండగానే ఇపుడు అల్లు వారి అబ్బాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలక్రిష్ణ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నాడు. నిజంగా ఈ కాంబో విశేషమే. బాలయ్య‌ మూవీ ఫంక్షన్ కి సాధారణంగా ఇతర హీరోల హాజరు తక్కువే. ఇక బాలయ్యే అక్కడ అట్రాక్షన్ గా ఉంటారు.

ఇపుడు మాత్రం అల్లు అర్జున్ రావడం అంటే నిజంగా స్పెషల్ గానే చూడాలి. ఈ మూవీ కి గెస్ట్ గా అబ్బాయి జూనియర్ ఎన్టీయార్ వస్తాడనుకుంటే అది కాస్తా అల్లు వారి అబ్బాయిగా మారింది. దాంతో అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మీద మరింతగా ఫోకస్ పెరిగింది. ఇక అల్లు వారితో బాలయ్యకు పెరిగిన అనుబంధానికి ఉదాహరణగా కూడా దీన్ని భావిస్తున్నారు.

మరో వైపు అల్లు అరవింద్ తో బాలయ్య తరువాత మూవీ ఉంటుందని, అది గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద తీస్తారని కూడా ప్రచారం ఇప్పటికే సాగుతోంది. టాలీవుడ్ లో పక్కా మాస్ హీరోలు ఇద్దరే ఇద్దరు. వారు చిరంజీవి, బాలయ్య. ఈ ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఉంది. అయినా సరే ఏనాడూ కలసి నటించలేదు. అయితే ఇపుడు అల్లు వారి ఫ్యామిలీ మనిషిగా బాలయ్య అయిపోయడు అంటున్నారు. దాంతో గీతా ఆర్ట్స్ లో బాలయ్య చేస్తే అది పెద్ద రికార్డే అవుతుంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ తో బాలయ్య కలసి ఒకే ఫ్రేమ్ లోకి రావడం అంటే నిజంగా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి ముచ్చటగానే ఉంటుంది.