బలగం శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడుతున్నారు..!

Sat Mar 18 2023 10:27:51 GMT+0530 (India Standard Time)

Balagam is competing for satellite rights..!

జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా రిలీజై రెండు వారాలు అవుతున్నా సినిమా అన్నిచోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మరొకరికి చూడాలని రిఫర్ చేస్తున్నారు. మౌత్ టాక్ తో ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకోబోతుంది. దిల్ రాజు అండ్ టీం తన మీద ఉంచిన నమ్మకాన్ని వేణు వినియోగించుకున్నాడు. వేణులో ఇంత మంచి దర్శకుడు దాగున్నాడా అని అందరు అవాక్కయ్యేలా చేశాడు. ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేయాలని అనుకున్న దిల్ రాజు ముందే ప్రీమియర్స్ వేసి పాజిటివ్ రివ్యూస్ తోనే సినిమా రిలీజ్ చేశారు.తెలంగాణా నేపథ్యం పల్లె వాతావరణంలో వచ్చిన బలగం కుటుంబ విలువలు.. మూలాలను తెలియచేస్తుంది. సినిమా ఇప్పటికే డబుల్ ప్రాఫిట్స్ తీసుకురాగా ఈ సినిమా రోజు రోజుకి ఎక్కువ ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమా కొనేందుకు ఛానెల్స్ కూడా పోటీ పడుతున్నాయట. చిన్న సినిమా అయినా గొప్ప విజయం అందుకున్న బలగం సినిమాకు శాటిలైట్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. జీ తెలుగు స్టార్ మా ఈ రెండు బలగం సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నాయని తెలుస్తుంది.

దాదాపు సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ శాటిలైట్ రైట్స్ డిమాండ్ ఉందని తెలుస్తుంది. అయినా సరే ఆ రెండు ఛానల్స్ వెనక్కి తగ్గట్లేదట. మరో పాతిక ఎక్కువ ఇచ్చైనా సరే బలగం శాటిలైట్ పొందాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా అదే రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయట. దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదటి సినిమాగా వచ్చిన బలగం సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ గా వేణు తన ప్రతిభ చాటాడు.

బలగం సినిమాను తెలంగాణా రాజకీయ నేతలు కూడా పర్సనల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం వారు నాలుగు ఆట బుక్ చేసి నియోజకవర్గ ప్రజలకు ఫ్రీగా చూపిస్తున్నారు. ఈ సినిమాకు పొలిటికల్ గా వచ్చిన ఈ సపోర్ట్ సినిమాకు మరింత క్రేజ్ తెస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.