నిజంగా బాలయ్య ది గ్రేట్.. కారణం ఇదే

Mon Jan 23 2023 12:19:42 GMT+0530 (India Standard Time)

BalaKrishna Entertained The Audience By His Singing Again

చాలా మంది హీరోలు తమ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మెలుగుతూ ఉంటారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం అలా కాదు. సీనియర్ హీరోగా స్టార్ డమ్ ను మూడు నాలుగు దశాబ్దాలుగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన సినిమాలు అంటే అభిమానులు ఎక్కడ కోసుకోమంటే అక్కడ కోసుకుంటాం అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటి బాలకృష్ణ అభిమానులను అలరించేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. చాలా మంది హీరోలు టీవీ షో లు చేయాలని అనుకున్నా కూడా ట్రోల్స్ ఎదురవుతాయేమో అని.. ఎలా చేస్తామో అనే భయంతో ఆసక్తి చూపించరు.. కానీ బాలయ్య అన్ స్టాపబుల్ షో తో అభిమానుల కోసం ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

ఇక బాలకృష్ణ పాట పాడిన ప్రతి సారి కూడా సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తూ.. మీమ్స్ క్రియేట్ చేస్తూ అవహేళన చేస్తూ వస్తున్నారు. ఒక్కసారి అలా ట్రోల్ అయితే ఇతర హీరోలు అయితే జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ బాలయ్య అలా కాదు.. అందుకే బాలయ్య ది గ్రేట్ అంటూ ఫ్యాన్స్ మరోసారి అనుకుంటూ ఉన్నారు.

బాలకృష్ణ తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో సింగర్స్ తో కలిసి గొంతు విప్పారు. ముందస్తుగా అనుకోకుండా.. అప్పటికప్పుడు సింగర్స్ తో కలిసి పాడటం అనేది కచ్చితంగా ఎంత ప్రొఫెషనల్ సింగర్ కి అయినా కష్టమే. కానీ బాలయ్య ఏమాత్రం బెరుకు లేకుండా పాట పాడేశాడు.

థమన్ తనను ఈ సినిమాలో పాడనివ్వలేదు అంటూ సరదాగా మాట్లాడటంతో పాటు పాట పాడి అభిమానులను కేరింతలు పెట్టేలా చేశాడు. ఈసారి కూడా కచ్చితంగా బాలయ్య యొక్క పాట ను కొందరు ట్రోల్స్ చేస్తారు. కానీ అభిమానులు ఆనందపడుతారు అనే ఉద్దేశ్యంతో బాలయ్య ట్రోల్స్ ను పట్టించుకోకుండా పాట పాడాడు.

ముందు ముందు కూడా బాలయ్య నుండి ఇలాంటివి చాలానే అభిమానులు సర్ ప్రైజ్ గా పొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ను సంతోష పెట్టడమే బాలయ్య దృష్టిలో ఉంటుంది.. ఎవరు ఏం అనుకుంటారు అనే ఆలోచన అస్సలు చేయడు. చాలా సింపుల్ గా చిన్న పిల్లాడి మాదిరిగా బాలయ్య ప్రవర్తిస్తూ ఉంటాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.