Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్ నాగబాబు 'ఛీ ఛీ' అనేంత చీప్ అయిపోయాడా...?

By:  Tupaki Desk   |   2 Jun 2020 5:00 AM GMT
మెగా బ్రదర్ నాగబాబు ఛీ ఛీ అనేంత చీప్ అయిపోయాడా...?
X
ఇటీవల హిందూపూర్ ఎమ్మెల్యే.. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరియు మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. కాగా ఆ సమావేశానికి మిమ్మల్ని పిలవలేదా అని బాలయ్యను ప్రశ్నించగా 'నన్నెవరూ పిలవలేదు.. వాళ్ళందరూ తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారేమో' అని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఇక ఆ విషయంపై నాగబాబు స్పందిస్తూ 'నువ్వు కింగ్ వి కాదు.. జస్ట్ ఒక హీరోవి మాత్రమే.. బాలకృష్ణ వెంటనే ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి' అని డిమాండ్ చేస్తూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై వెంటనే నాగబాబు స్పందించడంతో ఇది నందమూరి మెగా అభిమానుల వార్ గా మారింది. అంతేకాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విబేధాలు వర్గపోరు నడుస్తుందేమో అనే చర్చకు దారితీసింది.

ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయంపై స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో నాగబాబుకు మీకు గొడవ జరిగిందిగా.. నాగబాబు వ్యాఖ్యలపై మీరేమంటారు? అని సదరు యాంకర్ ప్రశ్నించగా "ఛీ ఛీ... నేనేమంటాను.. అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?" అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇప్పుడు బాలయ్య ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో ఉంది. దీంతో బాలయ్య మాట్లాడిన ఆ క్లిప్పింగ్స్ సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు అనవసర విషయాలలో తల దూర్చుతూ తోటి నటుడు బాలకృష్ణ 'ఛీ ఛీ' అనేంత చీప్ అయిపోయాడని నందమూరి అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. అన్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చెడ్డపేరు తీసుకొస్తున్నారని.. అనాలోచితంగా మాట్లాడుతూ.. వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ అందరి దృష్టిలో అవివేకిగా మిగిలి పోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా టవర్ స్టార్ నాగబాబు తన తప్పు తెలుసుకొని మెలిగితే మంచిదని వారు సూచిస్తున్నారు. మరి నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.