బాలకృష్ణలో 'ఫ్యామిలీ మ్యాన్ ను' ఎప్పుడైనా చూశారా?

Sun Jan 16 2022 11:03:12 GMT+0530 (IST)

Bala Krishna As Family Man

ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణను ఇలా ఎవరూ చూసి ఉండరేమో. సినీ నటుడిగా సుదీర్ఘ కాలంగా సాగుతున్నా.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటకు రావు. సినీ నటుడిగా ఆయనకున్న క్రేజ్..నందమూరి నట వారసుడిగా ఆయనకున్న అభిమానులు పులకరించిపోయే వీడియోగా దీన్ని చెప్పాలి. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. కుటుంబంతో గడిపే వేళలో ఎలా ఉంటారు? ఎంత సరదాగా ఉంటారన్న విషయాన్నితెలియజేసే వీడియోగా దీన్ని చెప్పొచ్చు.ఈసారి సంక్రాంతి పండక్కి తన సోదరి పురంధేశ్వరి అత్తారిల్లు అయిన కారంచేడుకు సతీ సమేతంగా వెళ్లిన బాలయ్య.. గడిచిన మూడు రోజులుగా సందడి చేస్తున్నారు. శనివారం గుర్రం ఎక్కటం.. ఎడ్ల బండిని ఊళ్లో నడపటం లాంటివి చేసిన ఆయన.. తాజాగా నందమూరి ఫ్యామిలీ మొత్తం. .కారంచేడుకు సమీపంలోనిచీరాల బీచ్ కు వెళ్లి సందడి చేశారు. ఈ బీచ్ లో తన సతీమణి వసుంధరతో కలిసి ఫోర్డు జీపులో.. సముద్రపు ఒడ్డున సరదాగా డ్రైవ్ చేసిన వైనానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

జీపును స్టార్ట్ చేసి.. రైడ్ కు వెళ్లే వేళలో థమ్స్ అప్ చూపిస్తే.. ఆయన సతీమణి వసుంధర మాత్రం టాటా చెప్పారు. ఈ సందర్భంగా భార్యను.. టాటా చెప్పకూడదు.. థమ్స్ అప్ చెప్పాలని కరెక్టు చేయటం.. టాటా చెప్పటం అంటే.. సముద్రంలోకివెళ్లటమే అంటూసరదాజోక్ వేశారు.

 ఆయన మాటలకు అనుగుణంగా వసుంధర.. థమ్స్ అప్ చూపించటం.. సముద్ర ఒడ్డున జీప్ డ్రైవ్ చేసిన బాలయ్య.. ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత.. పిల్లల్ని  జీపు ఎక్కమని చెప్పటంతో ఈ వీడియో ముగుస్తుంది. దాదాపు 1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్నట్లుగా ఉన్న బాలకృష్ణ తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంది.