బిగ్ బాస్ లో క్లీన్ సేవ్ లు...ఘాటు ముద్దులు

Tue Sep 17 2019 10:52:20 GMT+0530 (IST)

Baba Bhaskar Clean Shave In Bigg Boss 3

బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎప్పుడు ఏదొక కొత్త విధానంలో ఎలిమినేషన్ ప్రక్రియ జరుపుతున్న బిగ్ బాస్....సోమవారం సరికొత్త విధానంలో నామినేషన్ చేపట్టాడు. మొదట ఎపిసోడ్ ప్రారంభంలో పునర్నవి - వరుణ్ - మహేశ్ ఎలిమినేషన్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. వీరి చర్చ తర్వాత బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియని వెరైటీగా మొదలుపెట్టాడు. ఉదయం పూటే బిగ్  బాస్ గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్ పెట్టారు. దీంతో అందరూ ఇంటి నుంచి ఫోన్లు వస్తాయని అనుకున్నారు.కానీ అలా జరగలేదు. ఫోన్ మొదటి రింగ్ అవ్వగానే శ్రీముఖి పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేయడమే బిగ్ బాస్ వాయిస్ వినిపించింది. ఫోన్ లిఫ్ట్ చేసినందుకు ఎలిమినేషన్ కు డైరెక్ట్ గా నామినేట్ అవుతున్నావని చెప్పడంతో షాక్ అయింది. అయితే ఈ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వాలంటే...బాబా భాస్కర్ తో గడ్డం తీయించాలని రూల్ పెట్టారు. దీంతో శ్రీముఖి బాబాకు అసలు విషయం చెప్పడంతో....ఆయన వెంటనే ఒప్పుకుని గడ్డం తీయడానికి ఓకే చెప్పాడు. ఇక ఆ వెంటనే బాబా క్లీన్ షేవ్ చేసేశారు. ఆ తర్వాత ఫోన్ రాగానే శ్రీముఖి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

ఆ తర్వాత పునర్నవిని బూత్ లోకి వచ్చి తదుపరి కాల్ కోసం వెయిట్ చేయాలని చెప్పాడు. దీంతో పునర్నవికి ఫోన్ రాగా - నేరుగా నామినేట్ అవుతున్నావని చెప్పిన బిగ్ బాస్....సేవ్ అవ్వాలంటే రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాలని కండిషన్ పెడతాడు. దీంతో పున్నూ అసలు విషయం రాహుల్ కు చెప్పింది. వెంటనే రాహుల్ ఒప్పుకుని తాగడానికి సిద్ధమయ్యాడు. అయితే రాహుల్ వాంతులు చేసుకుంటూ మరీ 20 గ్లాస్ ల కాకరకాయ రసాన్ని పున్నూ కోసం అమృతం తాగినట్టు తాగేశాడు. దీంతో రాహుల్‌ని దగ్గరకు తీసుకుని పునర్నవి డీప్ హగ్ ఇవ్వడమే కాకుండా.. ఘాటు ముద్దు ఇచ్చేసింది.