సుశాంత్ కేసు: ప్రధానికి సుబ్రహ్మణ్యస్వామి సంచలన లేఖ

Thu Jul 16 2020 19:00:46 GMT+0530 (IST)

Sushant case: Subramanyaswamy's sensational letter to the Prime Minister

బాలీవుడ్ అగ్రహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ ఎంపీలు.. పలువురు బాలీవుడ్ తారలు డిమాండ్ చేయగా.. తాజాగా సినీ ప్రముఖుడు శేఖర్ సుమన్ కూడా సీబీఐ దర్యాప్తునకు ఆన్ లైన్ ఉద్యమం ప్రారంభించారు.ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై అనుమానం వ్యక్తం చేసి విచారణ జరపాలని ఓ లాయర్ ను కూడా నియమించిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన తరుఫు న్యాయవాది ఇష్కరన్ సింగ్ ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీకి రాసిన లేఖలో సుబ్రహ్మణ్యస్వామి పలు ఆరోపణలు చేశారు. తన న్యాయవాది ఇష్కరన్ భండారి చేసిన పరిశోధనలో పలు షాకింగ్ అంశాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు.

సుశాంత్ మరణం వెనుక బాలీవుడ్ ప్రముఖులు.. దుబాయ్ లోని ఓ మాఫియా డాన్ హస్తం ఉందని సుబ్రహ్మణ్యస్వామి తాజాగా ప్రధానికి రాసిన లేఖలో సంచలన ఆరోపణ చేశారు. ఇలాంటి విషయాలు బయటకు రావాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.