Begin typing your search above and press return to search.

బీబీ-3: క‌ళ్లు కాయ‌లు కాస్తున్నాయంటున్న ఫ్యాన్స్‌..!

By:  Tupaki Desk   |   5 March 2021 12:30 AM GMT
బీబీ-3: క‌ళ్లు కాయ‌లు కాస్తున్నాయంటున్న ఫ్యాన్స్‌..!
X
నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రాబోతున్న విష‌యం తెలిసిందే. బీబీ-3 వ‌ర్కింగ్ టైటిల్ తో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడెప్పుడో మినీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో బాల‌య్య లుక్స్‌.. డైలాగ్స్ కు అభిమానుల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. త‌న‌దైన యాక్ష‌న్‌, మేన‌రిజంతో బాల‌కృష్ణ అద‌ర‌గొట్టారు. దీంతో.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు.

వీరి ఎదురు చూపుల‌కు తెరదించుతున్నామ‌న్న‌ట్టుగా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశారు మేక‌ర్స్‌. మే 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దుల్లేకుండా పోయాయి. ఇంత వ‌ర‌కూ బాగానే ఉందిగానీ.. అస‌లు విష‌యంలో మాత్రం స‌స్పెన్స్ మెయింటెయిన్ చేస్తూనే ఉన్నారు.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ టైటిల్ ఏంట‌న్న‌ది ఇప్ప‌టికీ తెలియ‌లేదు. ఈ చిత్రానికి టైటిల్ ఇదేనంటూ ప‌లు టైటిల్స్ చ‌ర్చ‌లోకి వ‌చ్చాయి. మొదట్లో ''మోనార్క్'' పేరును పరిశీలిస్తున్నారని, అదే కన్ఫాం అని అన్నారు. కానీ.. ఆ తర్వాత డిస్కషన్లో లేకుండాపోయింది. ఆ తర్వాత ''గాడ్ ఫాదర్'' అని ప్రచారంలోకి వచ్చింది. కానీ.. అది కూడా ఫైనల్ కాలేదు.

దీంతో.. బాలయ్య సినిమాకు ఎలాంటి పేరు పెడుతున్నారోన‌ని ఫ్యాన్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. త్వ‌ర‌గా ఆ ముచ్చ‌ట కూడా తీర్చేస్తే బాగుంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఈ శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 11న బీబీ-3 టైటిల్ అనౌన్స్ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి, ఆ రోజైనా వ‌స్తుందా? మ‌ళ్లీ ఉసూరుమ‌నిపిస్తారా? అని టెన్ష‌న్ ప‌డుతున్నారు ఫ్యాన్స్‌. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ద్వ‌రకా క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.