ఒరిజినల్ ను శ్రద్ధగా ఫాలో అయ్యారే!

Fri Apr 19 2019 22:48:07 GMT+0530 (IST)

Ayogya Trailer

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 'టెంపర్' ఒక ప్రత్యేకమైన చిత్రం.  ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. క్లైమాక్స్ సీన్లో ఎలాంటి కర్కోటక ప్రేక్షకుడి చేతైనా కంటతడి పెట్టిస్తాడు ఎన్టీఆర్.  స్టొరీ పరంగా ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం ఒకే కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ ను మ్యాచ్ చేయడం దాదాపుగా అసాధ్యం.  కానీ ఈ సినిమాకు ఇప్పటికే హిందీ రీమేక్ 'సింబా' వచ్చేసింది.  పోయినేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఆ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. ఇప్పుడు తమిళ రీమేక్ కు రంగం సిద్ధం అవుతోంది.విశాల్.. రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం నాడు విడుదలైంది.  దాదాపు రెండు నిముషాలున్న ఈ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. మనం తెలుగు ప్రేక్షకులం కాబట్టి ఊరికే ఎన్టీఆర్ టెంపర్ తో పోలుస్తాం.  అలా కాకుండా చూస్తే ట్రైలర్ డీసెంట్ గా ఉంది. ఒరిజనల్ సినిమాను పెద్దగా మార్చకుండా కాపీ చేసుకుంటూ వెళ్లిపోయారు.  'యానిమల్ లవర్' డైలాగ్.. తో పాటు.. క్లైమాక్స్ సీన్ లో "అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసే ధైర్యం నాకుంది. మరి వెంటనే...ఈ క్షణమే శిక్ష వేసే ధైర్యం ఉందా?" అని అడిగే సీరియస్ డైలాగ్ లను ఉంచారు. హిందీ 'సింబా' సూపర్ హిట్ అయినట్టే ఈ సినిమా 'అయోగ్య'కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.

ఎన్ని చెప్పినా.. మన తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనతో పోలికలు తీసుకురాకుండా ఉండలేరు కాబట్టి ఆ విషయం కూడా మనం క్లియర్ గా ప్రస్తావించుకోవాలి. ఎన్టీఆర్ ను విశాల్ మ్యాచ్ చేయలేకపోయాడు.  పోలికలు లేకుండా ఫ్రెష్ సినిమా లాగా భావించి చూస్తే మాత్రం విశాల్ యాక్టింగ్ బాగుంది. వంక పెట్టలేం!