Begin typing your search above and press return to search.

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు ప్రతిష్టాత్మక అవార్డు

By:  Tupaki Desk   |   2 Feb 2023 5:30 PM GMT
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు ప్రతిష్టాత్మక అవార్డు
X
మాస్ పల్స్ తో పాటు ఎమోషన్ గురించి బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కేవలం టాలీవుడ్ లో నే కాకుండా బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కు పేరుంది.

టీనేజ్ లోనే సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు... అనేక సినిమాలకు, పాటలకు మంచి మ్యూజిక్ ను ఇచ్చారు. కేవలం పాటల ద్వారానే కాకుండా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కూడా ఆయన అభిమానులకు టచ్ లో ఉంటాడు.

తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందులో తనకు ఓ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్లు వివరించాడు. భారతదేశపు అతి పెద్ద, ఉత్తమ చలన చిత్ర పత్రిక స్టార్డస్ట్ 50వ వార్షికోత్సవ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగగా... ఇందులో దేవిశ్రీ ప్రసాద్ కు భారతీయ సినిమాలో సంగీతానికి అత్యత్తమ సహకారం అందించినందుకు గాను ప్రత్యేక అవార్డును ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

అవార్డును చేత పట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అలాగే ట్విట్టర్ వేదికగానే స్టార్ డస్ట్ కు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవిశ్రీ ప్రసాద్ కు కేవలం ట్విట్టర్ లోనే 4.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దేవి పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే ఈ ఫొటోలకు వేలల్లో లైకులు వచ్చాయి. వందల్లో కామెంట్లు వచ్చాయి.

దేవి శ్రీ ప్రసాద్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీరు ఇలాంటి మరెన్నో అవార్డులను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతకు మించిన అదిరిపోయే మ్యూజిక్ లను ఇచ్చే తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచాలని సూచించారు. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ద్వారా దేవి శ్రీ నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.