Begin typing your search above and press return to search.

ఎక్స్ ఫోజింగ్ కి నేను రెడీ అంటున్న 'చిన్నారి పెళ్లికూతురు'

By:  Tupaki Desk   |   4 April 2020 8:30 AM GMT
ఎక్స్ ఫోజింగ్ కి నేను రెడీ అంటున్న చిన్నారి పెళ్లికూతురు
X
అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే 'అవికా'గా కాదు 'చిన్నారి పెళ్లికూతురు' అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు.'చిన్నారి పెళ్లి కూతురు'(బాలికా వధు) సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పుడే ఎమోషనల్ గా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్న అమ్మడు... రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఉయ్యాలా జంపాల' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న అవికా, తరువాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత రేంజ్ కి మాత్రం వెళ్లలేకపోయింది.

తర్వాత నాగసౌర్యతో కలిసి 'లక్ష్మీ రావే మా ఇంటికి', రాజ్ తరుణ్ తో 'సినిమా చూపిస్తా మామా' - 'తను నేను' - 'మాంజా' - నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలలో నటించింది. అయితే అవికా గోర్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగానే ఉంటుంది. చాలా గ్యాప్ తీసుకొని ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజు గారి గది 3' సినిమాలో యాక్ట్ చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. రాజుగారిగది 3 కనీసం గుర్తింపు కూడా తీసుకురాకపోవడంతో అవికా ప్రస్తుతం ఆలోచనలో పడిపోయింది. త‌న‌కు లైఫ్ ఇచ్చిన సీరియ‌ల్స్ వైపు అడుగులు వేస్తుంది ఈ చిన్నారి పెళ్లికూతురు.

ప్రస్తుతం కెరీర్ నిలబెట్టుకోవడం కోసం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది అవికా. సూప‌ర్ హాట్‌ గా మారిపోతూ.. అభిమానుల‌కు స‌ర్ ప్రైజింగ్ గిఫ్టులు ఇస్తుంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి షాకే ఇచ్చింది ఈ భామ‌. ఈ ఫోటోలలో ఈమె మేకోవ‌ర్ చూసి వారెవ్వా అంటూ ఫిదా అయిపోతున్నారు ఆడియ‌న్స్. అమ్మడు అందాల ఆరబోత చూస్తుంటే హాట్ బ్యూటీ ఇమేజ్ కోసం పోటీ పడుతున్నట్లే అనిపిస్తుంది. అందుకే గ్లామర్ షోకు కూడా తనకు ఎలాంటి అడ్డు లేదని చెప్పకనే చెబుతుంది అవికా గోర్. మరి ఈ గ్లామర్ షో అవికాకు అవకాశాలు తీసుకొస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతం మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటించడానికి చర్చలు జరుపున్నట్లు సమాచారం.