ఫోటోటాక్ : అందాల అవిక ఈ దెబ్బతో ఆగదిక

Thu May 19 2022 08:00:01 GMT+0530 (IST)

Avika Gor Latest Photo

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో పరిచయం అయిన అవికా గౌర్ కాస్త పెద్దయ్యాక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా మారి ఎంటర్ టైన్ చేసిన విషయం తెల్సిందే. ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్ తో అడుగు పెట్టిన అవికా గౌర్ రెండు మూడు వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. కాని ఆ తర్వాత అవికా కెరీర్ డౌన్ ఫాల్ మొదలు అయ్యింది.హీరోయిన్ గా ఆఫర్లు తగ్గడం తో పాటు కాస్త  బరువు పెరగడం వల్ల ఈ అమ్మడిని జనాలు ఆదరించ లేదు. మొత్తానికి అందాల అవిక కాస్త బొద్దుగుమ్మ అవికగా మారింది. ఆ సమయంలో పట్టుదలతో అవికా గౌర్ బరువు తగ్గింది. సన్నగా నాజూకుగా అందంగా సెక్సీగా తయారు అయ్యింది. బాలీవుడ్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తూ ఉంది.

సన్నబడ్డ తర్వాత అవికా గౌర్ లో అందం మరింత పెరిగిందని.. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా అందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమద్య కాలంలో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే ఈమె ఆమెనా అన్నట్లుగా ఉందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా కూడా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అవికా గౌర్ సెకండ్ ఇన్నింగ్స్ ను సౌత్ లో లేదా నార్త్ లో మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియా ద్వారా తన అందాల విందును అభిమానులకు మరియు నెటిజన్స్ కు ఎరవేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్బుతమైన ఫిజిక్ కూడా ఈమె సొంతం అన్నట్లుగా ఉందటంతో అవిక ఈ దెబ్బతో ఖచ్చితంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటో ఎప్పటిలాగే వైరల్ అవుతోంది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. భుజం పై డ్రస్ ను కాస్త తప్పించి అక్కడ ఉన్న టాటూను కనిపించి కనిపించకుండా ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకున్న ఈ అమ్మడి అందానికి ఎంతగా పొగిడినా తక్కువే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈమెకు ముందు ముందు అక్కడ లేదా ఇక్కడ ఎక్కడో ఒక చోట తప్పకుండా ఆఫర్లు రావడం ఖాయం అనిపిస్తుంది.