అవతార్ అద్భుతం.. ఆ రికార్డ్స్ బ్రేక్

Fri Jan 27 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Avatar is awesome.. That records break

దిగ్గజ దర్సకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఈ చిత్రం మరిన్ని రికార్డులను అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రముఖ మార్వెల్ సినిమా అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రికార్డులను బ్రేక్ చేసింది. అవతార్ 2 గ్లోబల్ బాక్సాఫీస్ ముందు 2.054 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో  2018లో విడుదలైన ఇన్ఫినిటీ వార్ (2.052 బిలియన్ డాలర్లు) స్పైడర్ మ్యాన్ నో వే హోమ్(1.92 బిలియన్ డాలర్లు) రికార్డులను అధిగమించింది. ఈ మార్క్తో ప్రపంచంలోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్లో టాప్-5లో చోటు దక్కించుకుంది. ఐదో స్థానంలో నిలిచింది.

అవతార్ 2 ఒక్క అమెరికాలోనే 603 మిలియన్ డాలర్లను సాధించగా.. అంతర్జాతీయ స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. దీంతో సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో చిత్రంగానూ నిలిచింది. గ్లోబల్ బాక్సాఫీస్ ముందు 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఆరో చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులోనూ విడుదలైన ఆరు వారాల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 1.5 బిలియన్ డాలర్లు అవసరం కాగా.. ఆ వసూళ్లను అవతార్ 2 ఎప్పుడో సాధించింది. దీంతో ఈ సినిమాలు మంచి లాభాలు వచ్చినట్టైంది. అయితే ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 17 వరకు హాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల కావట్లేదు. ఫిబ్రవరి 17న యాంట్ మ్యాన్ వ్యాస్ప్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.