Begin typing your search above and press return to search.

హైయెస్ట్ కలెక్షన్స్ లో అవతార్ 2.. స్థానం ఏంటంటే?

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:00 PM GMT
హైయెస్ట్ కలెక్షన్స్ లో అవతార్ 2.. స్థానం ఏంటంటే?
X
జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా హాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా అవతార్ 2. ఈ మూవీ అవతార్ కి సీక్వెల్ గా సుమారు 12 ఏళ్ళ తర్వాత మరల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక మొదటి భాగంలో పండోరా గ్రహాన్ని చూపించిన జేమ్స్ కెమరూన్ ఈ సారి వాటర్ వరల్డ్ ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ వాటర్ వరల్డ్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది.సినిమా కంటెంట్ పరంగా కాస్తా స్లోగా ఉందనే మాట వినిపించిన విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్బుతాన్ని జేమ్స్ కెమరూన్ ఆవిష్కరించారని చెప్పాలి.

ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే 2 బిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇందన్ కరెన్సీలో చూసుకుంటే 17 వేల కోట్లకి పైనే ఈ కలెక్షన్ మొత్తం ఉంటుంది. ఒక సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ చేయడం అంటే అసలు చిన్న విషయం కాదు.

అయితే నాలుగు హాలీవుడ్ సినిమాలు ఈ స్థాయిలో కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఆ సినిమాలు చూసుకుంటే అవతార్ మొదటి స్థానంలో ఇప్పటికి ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.92 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

దీని తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ 2.79 బీలియన్ డాలర్స్ గ్రాస్ తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో టైటానిక్2.2 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ఉంది. దీని తర్వాత స్థానంలో అవతార్ 2 మూవీ ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా. 2.074 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇకా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. లాంగ్ రన్ లో టైటానిక్ ని బీట్ చేసి మూడో స్థానంలోకి అవతార్ 2 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

అయితే 2 బిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 4 ఉంటే అందులో మూడు సినిమాలు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించినవే కావడం విశేషం. అయితే టైటానిక్ తక్కువ టికెట్ రెట్లతోనే 2 బిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

అలాగే అవతార్ సినిమా కూడా తక్కువ టికెట్ ధరలతో హైయెస్ట్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. ఆ రెండింటితో పోల్చుకుంటే జేమ్స్ కెమరూన్ నుంచి ప్రేక్షకుల అంచనాలని పూర్తి స్థాయిలో అందుకోలేకపోయిన సినినా అవతార్ 2 అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.