సినీ ప్రేమికులను ఊరిస్తున్న 2023 సినిమాలు ఇవే

Sat Apr 01 2023 10:41:42 GMT+0530 (India Standard Time)

Audience Excited For 2023 Tollywood Films

2023 సంవత్సరంలో అప్పుడే మూడు నెలలు పూర్తయ్యాయి. ఈ మూడు నెలల కాలంలో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు పదుల కొద్దీ సినిమాలు వచ్చాయి. అయితే ఎప్పటిలాగే చాలా తక్కువ సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ అయితే కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించాయి.మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే రాబోయే తొమ్మిది నెలల కాలంలో స్టార్ హీరోల సినిమాలు అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది.

రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న శంకర్ దర్శకత్వంలోని సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ డిసెంబర్ లో విడుదల కాకుంటే ఆ సినిమా కూడా ఈ సంవత్సరం రానట్లే. మరికొందరు హీరోలు కూడా ఈ సంవత్సరంలో తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితి లేదు.

మహేష్ బాబు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఈ సంవత్సరం రాబోతున్న స్టార్ హీరోల సినిమాల్లో అత్యంత ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తున్న చిత్రాల విషయానికొస్తే ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న నటిస్తున్న హరిహర వీరమల్లు.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం సలార్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్.. పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్న వినోదయ సీతమ్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా.. ఇంకా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవే కాకుండా టైర్ 2 హీరోలు కూడా ఈ సంవత్సరం కాస్త ఎక్కువ అంచనాలను మోస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఆ సినిమాల్లో కొన్ని సినిమాలు కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో కనీసం 20 హిట్ సినిమాలైనా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రధానంగా ఐదు నుంచి ఎనిమిది సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాటి ఫలితాలు ఏమిటో తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ 2023 సంవత్సరంలో మిగిలిన 9 నెలలు అభిమానులకు ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.