కేజీఎఫ్2 కాకున్నా ఆ రేంజ్ లో 'వకీల్ సాబ్' కోసం ప్రయత్నాలు

Wed Jan 13 2021 23:00:01 GMT+0530 (IST)

Attempts for Vakeel Saab in that range other than KGF2

ఇటీవల కన్నడ రాకింగ్ స్టార్ యశ్ బర్త్ డే సందర్బంగా విడుదల అయిన 'కేజీఎఫ్ 2'  టీజర్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. లైక్స్ మరియు వ్యూస్ విషయంలో వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. వంద మిలియన్ ల వ్యూస్ ను అతి తక్కువ సమయంలో దక్కించుకోవడంతో పాటు అయిదు మిలియన్ ల లైక్స్ అతి సింపుల్ గా కేజీఎఫ దక్కించుకుంది. ఆ స్థాయి రికార్డు మళ్లీ ఇప్పట్లో ఏ సినిమాకు సాధ్యం కాకపోవచ్చు. కాని పవన్ 'వకీల్ సాబ్' టీజర్ కు కాస్త అటు ఇటుగా ఆ రేంజ్ లో వ్యూస్ లైక్స్ ను అందించాలని పవన్ అభిమానులు ఆశ పడుతున్నారు. 

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అభిమానులు గత ఏడాది కాలంగా ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సౌత్ లో పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ట్విట్టర్ లో పవన్ అభిమానులు సాధించిన రికార్డులు కూడా ఇప్పటికి అలాగే ఉన్నాయి. కనుక వకీల్ సాబ్ సినిమా టీజర్ కు ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వస్తాయని అంటున్నారు.

కేజీఎఫ్ 2 కు అన్ని భాషల ప్రేక్షకుల నుండి ఆధరణ దక్కింది. కాని వకీల్ సాబ్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రమే వ్యూస్ వస్తాయి. అయినా కూడా రికార్డులు నమోదు మాత్రం ఖాయం అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నుండి వచ్చిన రామరాజు ఫర్ భీమ్ ఎన్టీఆర్ టీజర్ ను చాలా ఈజీగానే వకీల్ సాబ్ టీజర్ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అంటూ పవన్ అభిమానులు ధీమాతో ఉన్నారు. ట్విట్టర్ లో ఇప్పటికే అందుకు సంబంధించిన ట్రెండ్డింగ్ నడుస్తూనే ఉంది.