అమెరికాలో భారత నటుడిపై దాడి..!

Fri Mar 17 2023 11:02:52 GMT+0530 (India Standard Time)

Attack on Indian actor in America..!

ప్రముఖ పంజాబీ నటుడు అమన్ ధలివాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హృతిక్ రోషన్ ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జోదా అక్బర్ సినిమాలో రాజ్ కుమార్ రతన్ సింగ్ పాత్ర పోషించి... ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ. అయితే తాజాగా ఇతడిపై అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కత్తితో శరీరంపై పలుచోట్ల గాయపరచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్ నెస్ జిమ్ లో ఈరోజు ఉదయం 9 గంటలకు అమన్ ధలివాల్ పై దాడి జరిగింది. కసరత్తులు చేసేందుకు వెళ్లిన అమన్ పై నిందితుడు దాడికి దిగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన అతడిని జిమ్ సిబ్బంది దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. అయితే నిందితుడు కత్తితో ఎందుకు దాడి చేశాడన్ని విషయంపై స్పష్టత రాలేదు. శరీరం అంతా కట్లు కట్టి ఉన్న అమన్ చిత్రంతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిమ్ నిర్వాహకులను విచారించారు. అమన్ ధలివాల్ కు తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థి ఎలా ఉందన్న విషయం గురించి మాత్రం ఎవరూ చెప్పట్లేదు. అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు పోలీసులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించట్లేదు. వైద్యులు కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అమన్ ధలివాల్ పంజాబ్ లోని మాన్సాలో జన్మించారు. పంజాబీతో పాటు హిందీ తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా జోదా అక్బర్ బిగ్ బ్రదర్ ఖలేజా విస్రా ఇక్ కుడి పంజాబ్ డి. జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి అనంత్ ది ఎండ్ వంటి చిత్రాల్లో నటించాడు. నటుడు ఇష్క్ కా రంగ్ సఫేద్ ఫోరస్ మరియు విఘ్నహర్త గణేష్ వంటి టీవీ షోల్లో కూడా భాగమయ్యాడు. అమన్ ఢిల్లీలోని మెడికల్ కాలేజీ నుంచి రేడియాలీలో బ్యాచిలర్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.