రాహుల్ కపుల్స్.. క్యూట్ ఫొటోస్

Fri Jan 27 2023 20:19:43 GMT+0530 (India Standard Time)

Athiya Shetty KL Rahul Unseen Photos haldi ceremony

బాలీవుడ్ హీరోయిన్స్ ఇండియన్ క్రికెటర్స్ మధ్య మంచి స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. పార్టీ కల్చర్ లో పెరగడం వలన వీరందరూ కలిసి ఈవెంట్స్ లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఒకరితో ఒకరికి పరిచయాలు పెరిగి అవి ప్రేమ పెళ్లి వరకు వెళ్తాయి. ఇక ఇండియన్ క్రికెట్ బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి కథలు పటౌడీ నుంచి మొదలు పెడితే ఇప్పటి కెఎల్ రాహుల్ వరకు కొనసాగుతున్నాయి. హీరోయిన్స్ ని లవ్ లో పడేయడం తరువాత కొంతకాలం రిలేషన్ లో ఉండి పెళ్లి పీటలు ఎక్కడం అనేది జరుగుతుంది.ఇక వీరి వివాహాలు ఇండియన్ వైజ్ గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతాయి. విరాట్ కోహ్లి అనుష్క శర్మ పెళ్లి ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండియన్ స్టార్ క్రికెట్ బ్యాటర్ కెఎల్ రాహుల్ బాలీవుడ్ హీరోయిన్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు బంధువుల మధ్య వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుక కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 దీనికి కారణం ఈ పెళ్లి వేడుకకి క్రికెట్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇక ప్రముఖుల విశేష్ నడుమ వీరి పెళ్లి సంబరం సంబరాల నడుమ సాగింది. అయితే రాహుల్ పెళ్లి జరిగిన రోజే మరో ఇండియన్ క్రికెటర్ అక్షర పటేల్ వివాహం కూడా జరిగింది. అయితే అతను తన చిన్ననాటి ఫ్రెండ్ ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రాహుల్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీ కావడంతోనే హాట్ టాపిక్ అయ్యింది.

 ఇక ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫోటోలని కెఎల్ రాహుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో అభ్యంగన స్నానం చేయించారు. ఇందులో అతియా శెట్టి రాహుల్ సరదాగా ఒకరికి ఒకరు పసుపు రాసుకొని సరదాగా సందడి చేశారు. ఇక కుటుంబ సభ్యులు కూడా వారికి పసుపు రాసారు. అనంతరం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలని రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.