Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: బెడిసికొట్టిన‌ వ‌ర్మ ప్ర‌య‌త్నం

By:  Tupaki Desk   |   22 Sep 2021 8:30 AM GMT
ట్రెండింగ్: బెడిసికొట్టిన‌ వ‌ర్మ ప్ర‌య‌త్నం
X
రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే.. అది ఒక‌ప్పుడు.. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఆయ‌న ఏది చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. చిన్న బడ్జెట్ సినిమాలు.. అంటూ వ‌ర్మ ఈ మ‌ధ్య కుప్ప‌లు తెప్పలుగా సినిమాల్ని రిలీజ్ చేశాడు. వ‌ర్మ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ అంటూ ప్ర‌యోగాలు చేశాడు. కానీ ఏ ఒక్క‌టీ ఫ‌లించ‌లేదు. పైగా వివాదాలు చుట్టుముట్టాయి. కోర్టు కేసుల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చింది.

ఇవేవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో వ‌ర్మ ఈ మ‌ధ్య కొత్త బాట ప‌ట్టాడు. యూట్యూబ్ యాంక‌ర్ గా అవ‌తారం ఎత్తాడు. హాట్ లేడీస్ ని త‌న‌దైన పంథాలో బోల్డ్ గా ఇంటర్వ్యూలు చేస్తూ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. బిగ్ బాస్ 3 ఫేమ్ అరియానా గ్లోరీతో జిమ్ వ‌ర్క‌వుట్ వీడియోతో దీనికి తెర‌లేపిన వ‌ర్మ అదే త‌ర‌హాలో మ‌రో హాట్ లేడీ అషురెడ్డితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూని ప్లాన్ చేశాడు. అడ‌ల్ట్ ప్ర‌శ్న‌ల‌తో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేశాడు. అశు కూర్చుంటే మోకాళ్ల‌పై కూర్చుని ఆమె థైస్ ని లో యాంగిల్ లో వీడియోస్‌.. ఫొటోస్ తీస్తూ వ‌ర్మ ర‌చ్చ చేశాడు.

టిక్ టాక్ స్టార్ అషురెడ్డిని వ‌ల్గ‌ర్ గా వ‌ర్మ క్వ‌శ్చ‌న్ చేయ‌డంతో చిర్రెత్తుకొచ్చిన అషు మ‌రో ఆలోచ‌న లేకుండా వ‌ర్మ గూబ గుయ్ మ‌నిపించింది. ఆ త‌రువాత అదే బుగ్గ‌పై త‌న సెక్సీ పెదాల‌తో కిస్ చేసి అందరిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే ఈ షోలో అషురెడ్డి గ్లామ‌ర్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం.. కెమెరా యాంగిల్స్ లో ఆమె అందాల‌ని క్యాప్చ‌ర్ చేయ‌డం చూసిన అషు ఫ్యామిలీ కొంత హ‌ర్ట్ అయ్యార‌ట‌.

టిక్ టాక్ స్టార్ స్కిన్ షోపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఇంటర్వ్యూను చిత్రీకరించిన విధానంతో అషు రెడ్డి కుటుంబం మొత్తం కలత చెందిందని చెబుతున్నారు. బిగ్ బాస్ తర్వాత అషు వెండితెరపై న‌టించాల‌ని భావించింది. అయితే `స్టార్ మా` కామెడీ షో `కామెడీ స్టార్స్` కోసం ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో ప్ర‌స్తుతం ఆ షోలో పాల్గొంటోంది. ఈ షోలో అషు కామెడీ టైమింగ్ తో ప్రశంసలు అందుకుంటున్న సమయంలో వ‌ర్మ‌ ఈ బోల్డ్ ఇంటర్వ్యూ ఆమె కుటుంబానికి కొంత ఆందోళన కలిగించిందనేది ఒక గుస‌గుస‌.

షోల‌ కోసం గ్లామరస్ గా వెళ్లడం మంచిదే కానీ ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ‌ర్మ త‌న ఇంటర్వ్యూలో అషు రెడ్డిని అస‌భ్యంగా చిత్రీకరించడం చాలా కుటుంబాలకు అస‌హ్యాన్ని క‌లిగించింది. దీంతో ఏదో చేయాల‌నుకున్న వ‌ర్మ ప్లాన్ బెడిసి కొట్టిందని చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అషు రెడ్డి త‌ల్లితో బోల్డ్ ఇంట‌ర్వ్యూ బావుంద‌ని చెప్పించినా అదేమీ వ‌ర్క‌వుట్ కాలేదు పాపం!!