ఎక్స్ క్లూజివ్: బిగ్ బాస్ లో ఈవారం ఈమె ఎలిమినేట్?

Sat Aug 24 2019 12:53:41 GMT+0530 (IST)

Ashu Reddy May Eliminate from Bigg Boss House This Week

బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఐదోవారంలోకి అడుపెట్టింది. హౌస్ లో కాస్త ప్రేమలు ఏడుపులు గొడవలు ఫైటింగ్ లు పెరిగిపోయాయి. ఎమోషన్స్ అన్నీ బయటకొస్తున్నాయి. తాజాగా హిమజ ఫస్ట్రేషన్ లో ఇంట్లోని గుడ్లు అన్నీ పగులకొట్టడం హాట్ టాపిక్ గా మారింది.  ఏ ఇంట చూసినా ఇప్పుడు బిగ్ బాస్ సందడి నెలకొంది. మహిళలు యువత - చిన్నా పెద్దా ఈ షో కు అతుక్కుపోతున్నారు. ఇక శని - ఆదివారాలు వస్తున్న నాగార్జున షోను మరింత రక్తికట్టిస్తున్నాడు. దీంతో షో రోజురోజుకు ప్రేక్షకులను అలరిస్తోంది.ప్రతీ శనివారం బిగ్ బాస్ హౌస్ లో తప్పులు చేస్తున్న వారికి వార్నింగ్ లు ఇస్తూ హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను బెంబేలెత్తిస్తున్నాడు. ఈరోజు రాత్రి కూడా నాగార్జున ఎవరిని ఉతికి ఆరేస్తాడన్నది వేచిచూడాలి. 
 
ఇక ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే..  మొత్తం ఏడుగురు ఎలిమినేషన్ కు రెడీగా ఉన్నారు.  పునర్నవి - హిమజ - అషురెడ్డి - రాహుల్ - బాబా భాస్కర్ - మహేష్ విట్టాతో పాటు శిక్ష పడిన శివజ్యోతిలలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. వీరిలో ఆదివారం ఎవరు వదిలివెళ్లిపోతారన్నది ఆసక్తిగా మారింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారం బిగ్ బాస్ నుంచి అషురెడ్డి ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది. ఈ శనివారమే ఈ ఎపిసోడ్ ను స్టార్ మా రూపొందిస్తుంది. సో అక్కడి నుంచి వచ్చిన లీక్స్ తోపాటు సోషల్ మీడియాలో ట్రెండ్స్ ను బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అషురెడ్డినే అని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ సంస్థలు పెట్టిన ఓటింగ్ ప్రకారం కూడా అషుకే తక్కువ ఓట్లు వచ్చాయట.. హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం.. తనదైన ముద్ర వేయకపోవడంతోనే ఆమెను ప్రేక్షకులు ఎలిమినేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా  పూర్తి స్థాయిలో ఎవరు ఎలిమినేట్ అయ్యేది తేలాలంటే   ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే..