అంతగా ఇంప్రెస్ చేసిన ఆ బ్యూటీ ఎవరై ఉంటారు?

Sat Jan 15 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Ashok Galla About Actress Nidhi Agarwal

యంగ్ హీరో ఆమె మాయలో పడిపోయాడు. తన అందం గురించి అతడు పొగిడేసిన తీరు చూస్తుంటే ప్రేమలో పడిపోయాడా? అన్న డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయ్. అంతగా ఇంప్రెస్ చేసిన ఆ బ్యూటీ ఎవరై ఉంటారు? అంటే.. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఎవరా కుర్రాడు? అంటే.. డెబ్యూ హీరో అశోక్ గల్లా.`ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ హిట్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన నిధి అగర్వాల్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టాలో ఈ భామను ఫాలో అయ్యే వారి సంఖ్య   డే బై డే పెరుగుతూనే ఉంది. టెంప్టింగ్ అప్టేడ్స్ తో క్రేజీగా వెలిగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి మహేష్ బాబు మేనల్లుడు యంగ్ హీరో అశోక్ గల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అశోక్ గల్లా సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోన్న సంగతి  తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో అశోక్ బ్యూటీని ఆకాశానికి ఎత్తేసాడు. ఈ సినిమా చూసాక అందరూ నిధి ప్రేమలో పడిపోవడం ఖాయం. అదీ కూడా ఒకసారి కాదు..టబుల్..ట్రిపుల్ టైమ్స్ నిధి  ప్రేమలో పడతారు. ఆమె మత్తులో మునిగి తేలుతారు. ఇందులో అంత అందంగా కనిపిస్తుందన్నాడు.

ఇక నటుడిగా తన గురించి చెబుతూ.. యాక్టింగ్ చేయాలని కమిట్ మెంట్ తో.... గౌరవంతో ఇండస్ట్రీకి వచ్చాను. `టక్ జగదీష్` సినిమా చూసాక..ఆ సినిమాని కాపీ కొట్టాను. అలాగే కొరటాల  శివగారి సినిమా సెట్ లో కొంత నేర్చుకున్నాను. అందువల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా హార్డ్ వర్క్ కి  కారణం మా బాబాయ్ సుధీర్ బాబు. ఆయన కష్టం మాటల్లో చెప్పలేనిది. ఆయనే నాకు స్ఫూర్తిగా అని అన్నారు. ఇక మావయ్య  మహేష్ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. మావయ్యకి బదులుగా బాబాయ్ ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపాడు.

ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాని జనవరి 15న రిలీజ్ చేస్తున్నారు. మరి అశోక్ ఈ మూవీ ఎలాంటి లాంచింగ్ ని ఇస్తుందో  చూడాలి. ఇటీవలే సూపర్ స్టార్ పెద్ద కుమారుడు రమేష్ బాబు స్వర్గస్తులైన నేపథ్యంలో సినిమా  వేడుకని సింపుల్ గా కనాచ్చేసారు.  సినిమాకి పెద్దగా ప్రచారం కల్పించలేదు. మహేష్ కూడా ఈ  సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. చూస్తుంటే సినిమానే మాట్లాడాలి అన్నట్టు ఉంది ఘట్టమనేని వ్యవహారం.