ఫోటో స్టొరీ: కొత్తపాప.. సరికొత్త బికినీ

Thu Jun 13 2019 09:39:57 GMT+0530 (IST)

Ashima Narwal In Bikini

అషిమ నర్వాల్ తెలుసు కదా? 'నాటకం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాతా హారర్ ఫిలిం 'జెస్సీ' లో నటించింది. ఈ రెండూ కాకుండా రీసెంట్ గా విడుదల అయిన విజయ్ అంటోనీ 'కొలైగారన్'(తెలుగులో 'కిల్లర్' టైటిల్ తో రిలీజ్ అయింది) లో హీరోయిన్ గా నటించింది. నటించింది మూడు సినిమాలే అయినా సోషల్ మీడియాలో నెటిజనులను ఎలా బుట్టలో వెయ్యాలి అనే విషయంలో మాత్రం అమ్మడికి ముప్పై సినిమాలు నటించిన హీరోయిన్లకు ఉన్నంత అనుభవం ఉంది.  అందుకే అషిమా చేసిన ఒక హాట్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అయింది.ఈ ఫోటో షూట్ లో ఏముంది ప్రత్యేకత అంటే బికినీ.  మల్టిపుల్ కలర్ స్ట్రైప్స్ ఉండే టూ పీస్ బికినీ ధరించి బీచ్ ఇసుకలో మోకాళ్ళపై కూర్చుంది. లూజ్ గా వదిలేసిన హెయిర్.. కళ్ళకు గాగుల్స్ ధరించి జుట్టును సవరించుకున్నట్టుగా తలపై చేతులు పెట్టింది. ఒక మిల్లీ గ్రామ్ కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా ఒంపుల వయ్యారాలను 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ.. కోకెత్తు కెళ్ళింది కొండగాలీ' అంటూ పాత హాటు పాటకు డబ్ స్మాష్ చేస్తున్నట్టుగా నిజంగానే పారేసుకుంటూ ఎక్స్ ప్రెషన్ పెట్టింది.  ఈ బికినీ.. ఆ నవ్వు చూస్తే ఇన్నోసెంట్ నెటిజన్లు తమ కళాత్మక హృదయాలను పారేసుకునేలా ఉన్నారు.  ఇక కె. రాఘవేంద్రయిజం ఫాలో అయ్యేవారు మాత్రం బత్తాయిలు.. నారింజలు.. ద్రాక్ష.. తదితర రొమాంటిక్ పండ్లను ఖరీదు చేసేందుకు నియరెస్ట్ రైతు బాజార్ కో లేదా..పండ్ల మార్కెట్ కో వెళ్తారు.  తప్పదు.. గురువుగారిని ఫాలో అయ్యేవారు పండ్లకు ప్రాధాన్యతనివ్వకపోతే ఎలా?

ఒకటి మాత్రం నిజం.  ఈ అషిమ వాలకం చూస్తుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో పాతుకుపోయిన పాతకాపుల ఫాలోయర్లను తనవైపు తిప్పుకున్నదాకా విరామం లేదు విశ్రాంతి లేదు అనేలా ఉంది. ఇలాంటి బికినీ ఫోటోలు మరో నాలుగు తగిలిస్తే చాలు.. ఫాలోయర్ల సంఖ్య ఆటోమేటిక్ గా ఒక మిలియన్ పెరుగుతుంది.  ఇక ఈ పాప ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే తమిళంలో 'రాజభీమ' అనే చిత్రంలో నటిస్తోంది.