మీ ట్రోల్స్ వల్లే ఇది సాధ్యం... స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sat Jul 02 2022 06:00:02 GMT+0530 (IST)

Arjun Kapoor comments on trollers

సినీ సెలబ్రెటీలను సోషల్ మీడియాలో ఎంతగా ఫాలోయింగ్ కలిగి ఉంటారో అంతగా ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో కొందరు పట్టుబట్టి మరీ ట్రోల్స్ చేసే వారు చాలా మంది ఉంటారు. ఆ ట్రోల్స్ కొన్ని సార్లు సెలబ్రెటీలను బాధ పెడితే మరి కొన్ని సార్లు వారికి వారు ఆలోచించుకునేలా కూడా ఆ ట్రోల్స్ ఉంటాయి. దాదాపు అందరు ప్రముఖులు ట్రోల్స్ ఎదుర్కొన్న వారి జాబితాలో ఉన్నారు.ఇటీవల బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ కూడా విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆయన బాడీ షేమింగ్ గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా కూడా ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి.. ఆయన ఫిజిక్ గురించి జనాలు చేసిన ట్రోల్స్ కు ఆయన ఎక్కువగా కౌంటర్ ఇవ్వలేదు. కాని ఆ ట్రోల్స్ కు స్పందించాడు. ఆ ట్రోల్స్ ను పాజిటివ్ గా తీసుకుని సిక్స్ ప్యాక్ చేశాడు.

తాజాగా ఆయన నటించిన ఏక్ విలన్ రిటర్న్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. జాన్ అబ్రహ్మం.. దిశా పటానీ.. తారా సుతారియా లు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ బాగుందనే టాక్ రావడంతో పాటు హీరో అర్జున్ కపూర్ లుక్ పై కూడా చర్చ జరిగింది.

అర్జున్ కపూర్ ట్రైలర్ రిలీజ్ సందర్బంగా మాట్లాడుతూ ఈమద్య కాలంలో తాను ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి వ్యాఖ్యనించాడు. నా ఫిజిక్ గురించి వచ్చిన విమర్శలను పాజిటివ్ గా తీసుకుని సన్నగా అవ్వాలని భావించాను. మీరు ట్రోల్స్ చేయడం వల్లే నేను సన్నగా అవ్వాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ ట్రోల్స్ లేకుంటే ఖచ్చితంగా నేను ఇలా మారేవాడిని కాదని ఆయన అన్నాడు.

ట్రోల్స్ ను ఎంతో మంది పాజిటివ్ గా తీసుకున్న వారు ఉన్నారు. కాని మరీ ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఘనత కేవలం అర్జున్ కపూర్ కే దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు.

అంత ఫిజిక్ నుండి సిక్స్ ప్యాక్ కు రావడం అంటే మామూలు విషయం కాదు.. ఖచ్చితంగా ఈ విషయంలో అర్జున్ కపూర్ ను ప్రశంసించకుండా ఉండలేకున్నాం అంటూ గతంలో ట్రోల్స్ చేసిన వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.