Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో మ‌కాం వేసిన ప్రేమజంట‌

By:  Tupaki Desk   |   5 Dec 2021 11:30 PM GMT
మాల్దీవుల్లో మ‌కాం వేసిన ప్రేమజంట‌
X
బాలీవుడ్ సెల‌బ్రిటీల ఫేవ‌రెట్ వెకేష‌న్ స్పాట్ మాల్దీవులు బిజీ స్పాట్ గా మారిన‌ సంగ‌తి తెలిసిందే. తీరిక‌ స‌మ‌యం చిక్కితే మాల్దీవుల్లో వాలిపోతున్నారు అందాల నాయిక‌లు. నాలుగైదు రోజులు అక్క‌డ ఎంజాయ్ చేసి మ‌ళ్లీ ముంబై ప్లైట్ ఎక్కి వెళుతున్నారు. తాజాగా బాలీవుడ్ అజ‌రామ‌ర ప్రేమ‌పక్షులు అర్జున్-మ‌లైకా ఆరోరా జంట మాల్దీవుల్లో మ‌కాం వేసింది. ఒంట‌రి దీవిలో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా పంచుకుంటున్నారు.

ప్రియుడితో మ‌లైకా జంట‌గా దిగిన ఫోటోల్ని..సైక్లింగ్ చేస్తోన్న ఫోటోల్ని..ఓ వీడియోని కూడా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అయితే ఈ వీడియోలో మ‌లైకా సైకిల్ బ్రేక్ ఫెయిలైంది. స్లైకింగ్ చేస్తూ ఎదురుగా ఉన్న గ‌ట్టును ఢీకొట్టింది. అయితే ఇంత‌లోనే బ్యాలెన్స్ చేస్తూ కిందికి దిగిపోయింది.

ఈ జంట‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల గురించి ప్ర‌స్తావిస్తే..ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు రీత్యా చాలా గ్యాప్ ఉంది. 48 ఏళ్ల మ‌లైకా 33 ఏళ్ల అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేయ‌డం షాకింగ్ అయినా రిలేష‌న్ షిప్ అన్న‌ది నిజం. త‌ల్లి వ‌య‌సున్న కొడుకుతో రొమాన్స్ ఏమిటా అంటూ.. ఇన్ స్టా వేదిక‌గా ఎలాంటి విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చినా వాటిని ఎంతమాత్రం ప‌ట్టించుకోకుండా త‌మ‌ప‌ని త‌మ‌దే అన్న‌ట్లు ముందుకు సాగిపోతున్నారు. ప‌బ్లిక్ లోనే హగ్గులు..ముద్దుల వీడియోలు ఇప్ప‌టికే చాలాసార్లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటున్న‌ట్లు కూడా బ‌ల‌మైన‌ ప్ర‌చారం సాగుతోంది.

ఇక ఇద్ద‌రి వృత్తిగ‌త విష‌యానికి వ‌స్తే అర్జున్ క‌పూర్ న‌టుడిగా బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం డ‌జ‌న‌కు పైగా సినిమాలు చేతిలో ఉన్నాయి. అలాగే మ‌లైకా అరోరా కెరీర్ మాత్రం డ‌ల్ గానే సాగుతోంది. వ‌య‌సు మీద ప‌డ‌టంతో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఆమె సినిమాలు చేసి మూడేళ్లు అవుతుంది. టెలివిజ‌న్ షో ల‌తో మాత్రం బిజీగానే గ‌డుపుతోంది. వెబ్ సిరీస్ ల‌వైపు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అక్క‌డా వ‌య‌సు అడ్డంకిగా మారింది.