మలైకాతో పెళ్లి అర్జున్ కపూర్ ఉద్దేశం ఇది?

Thu Aug 11 2022 13:25:16 GMT+0530 (India Standard Time)

Arjun Kapoor Interesting Comments About His Marriage With Malaika

అర్జున్ కపూర్-మలైకా అరోరా డేటింగ్ వ్యవహారం బాలీవుడ్ లోనే కాదు..అన్ని ఉడ్ ల్లోనూ సంచలనమే.  ఆ జంటపై విమర్శలు అంతే ఆసక్తికరం. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసమే అంతటి విమర్శలకు దారి తీసింది. తనకన్నా 15 ఏళ్లు చిన్నోడైనా వాడితే డేటింగ్ ఏంటి? అని మైలకాని  విమర్శించిన నోళ్లు ఎన్నో? అదే తీరున అర్జున్ కపూర్ సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు.కొంత కాలంగా  ప్రేమలో మునిగి తేలుతోన్న జంట  వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు కూడా  ప్రచారం సాగింది. సూటిగా ఇదే విషయాన్ని వాళ్లిద్దర్నీ అడిగితే మాత్రం మౌనం దాల్చారు. కానీ ఈ మౌనం ఏదో ఒకరోజు విడాలి. ఇప్పుడా సమయం వచ్చేసింది. అవును కాఫివిత్ కరణ్ టాక్ షో కి హాజరైన అర్జున్ కపూర్ మలైకా తో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

`నేను మలైకాను ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా లేను.  కోవిడ్ లాక్ డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక సమయం గడిచిపోయింది. ఇప్పుడు కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నా. నా పని మాత్రమే సంతోషాన్ని కల్గిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా భాగస్వామిని బాగా చూసుకోగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు` అనేసాడు.

ఇప్పుడా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరు త్వరలోనే  పెళ్లి చేసుకుంటారని  బాలీవుడ్ మీడియాలో జరిగిన రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఇద్దరి రిలేషన్ షిప్ అధికారికమైన నేపథ్యం సహా ఎన్నో క్లోజ్ మూవ్ మెంట్స్ వివాహానికి దారి తీస్తున్నాయని పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఒకానొక సమయంలో మలైకా సైతం పెళ్లి చేసుకుంటే తప్పేముంది? అన్న వైఖరిని ప్రదర్శించింది.

కానీ తాజాగా అర్జున్ కపూర్ వ్యాఖ్యలతో అతను కెరీర్ పైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి కెరీర్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత మలైకాతో పెళ్లి గురించి పున పరిశీలిస్తాడా?  ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అన్నది గాని క్లారిటీ రాదు. ప్రస్తుతం అర్జున్ కపూర్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అలాగే  మలైకా అరోరా  కూడా వృత్తి పరంగా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది.