Begin typing your search above and press return to search.

అరియానా నడుమందం నాభి కేంద్రంపైనే ఆర్జీవీ క‌న్ను

By:  Tupaki Desk   |   16 Jun 2021 9:30 AM GMT
అరియానా నడుమందం నాభి కేంద్రంపైనే ఆర్జీవీ క‌న్ను
X
నేటిత‌రం కథానాయిక‌ల‌కు ఉచితంగా ప‌బ్లిసిటీ తేవాలంటే ఏం చేయాలి? జ‌నం క‌ళ్ల‌న్నీ స‌ద‌రు కొత్త బ్యూటీపైనే వాలాలంటే ఎలాంటి టెక్నిక్ బాగా వ‌ర్క‌వుట‌వుతుంది? అన‌వ‌స‌ర ప్ర‌చారార్భాటంతో సోష‌ల్ మీడియాల్లో హంగామా సృష్టించ‌డం ఎలా? హిట్టు లేక‌పోయినా నిత్యం లైమ్ లైట్ లో ఉండ‌డ‌మెలా? ఇలాంటి య‌క్ష ప్ర‌శ్న‌లన్నిటికీ స‌మాధానం కావాలంటే ఆర్జీవీనే అడ‌గాలి.

ఆయ‌న ఏం చేసినా అది సంథింగ్ హాట్ గా వైర‌ల్ అయిపోతుంది. ఆయ‌న బాణీ వాణీ ప్ర‌తిదీ యువ‌తరానికి కిక్కిస్తున్నాయి. అయితే ఇటీవ‌ల హ‌ద్దుమీరిన శృంగార స‌న్నివేశాల‌తో గ‌తి త‌ప్పిన సినిమాల‌తో అత‌డి ఇమేజ్ అమాంతం దిగ‌జారింది. అప్పుడ‌ప్పుడు ర‌క్త‌చ‌రిత్ర‌- 24/7 ఎటాక్స్ లాంటివి తీయ‌డం వ‌ల్ల అత‌డిని ఇంకా గుర్తుంచుకున్నారు కానీ.... ! ఈపాటికే మ‌ర్చిపోయేవారు.

ఏదైతేనేం ప్ర‌స్తుతం డీకంపెనీ పేరుతో ఓ ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ తెచ్చిపెడుతున్న ఆర్జీవీ క‌ళ్లు బిగ్ బాస్ బ్యూటీ అరియానాపై ప‌డిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా అరియానాకు విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ చేస్తున్నారు రామూజీ. త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన అరియానాతో జిమ్ చేయించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా మ‌రికొన్ని కొత్త ఫోటోలు వెబ్ లోకి వ‌చ్చాయి. అరియానా అందాల పైనే ఆర్జీవీ క‌ళ్లు జూమ్ చేసిన‌ ఓ ఫోటో ప్ర‌స్తుతం నెట్ లో వైర‌ల్ గా మారింది. ఇక ఈ ఫోటోల్లో అరియానా నడుమందం నాభి కేంద్రంపైనే ఆర్జీవీ క‌న్ను ప‌డ‌డంతో అది యూత్ లో హాట్ డిబేట్ గా మారింది. నిజానికి ఈ బోల్డ్ ఫోటోల‌తో ఎలాంటి ప‌బ్లిసిటీని ఆశించారో అది ద‌క్కింది.

ఆర్జీవీ దీనిని అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ! అంటూ వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి బోల్డ్ అరియానా వర్క‌వుట్ల ఇంటర్వ్యూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న నన్ను గ్లోరీఫై చేసిన ఇంటర్వ్యూ అంటూ ఆర్జీవీ ప్రచారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు. #అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ # అరియానాబోల్డ్ఆర్జీవీ #అరియానాగ్లోరీ అంటూ హ్యాష్ ట్యాగులు వైర‌ల్ గా మారాయి. అంతా బాగానే ఉంది కానీ అరియానా క‌థానాయిక‌గా ఆర్జీవీ తెర‌కెక్కించే సినిమా ఏదీ? అన్న‌ది ఇంకా తేల‌లేదు. ఆర్జీవీ జూమింగ్ తో అరియానాకు ఇండ‌స్ట్రీలో ప్రాధాన్య‌త పెరుగుతుందా లేక త‌గ్గుతుందా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. ఈ జూమ్ కొంత‌కాల‌మే. ఆ త‌ర్వాత త‌న‌కు తానుగానే నిరూపించుకోవాలి.