Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ కి యాక్సిడెంట్ కావాలని కోరుకున్నాను: అరియానా

By:  Tupaki Desk   |   30 Nov 2021 1:30 AM GMT
రాజ్ తరుణ్ కి యాక్సిడెంట్ కావాలని కోరుకున్నాను: అరియానా
X
అరియానాకి యాంకర్ గా మంచి క్రేజ్ ఉంది. చాలా యాక్టివ్ గా ఉండే అరియానా నాన్ స్టాప్ గా మాట్లాడుతూ, ఎంటర్టైన్ చేస్తుంటుంది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లో కొన్ని వారాల పాటు సందడి చేసిన దగ్గర నుంచి, ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక ఈ మధ్య వర్మతో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాంటి అరియానా రీసెంట్ గా రాజ్ తరుణ్ పట్ల తనకి చాలా కోపం ఉండేదంటూ, అందరిలో ఆసక్తిని పెంచింది. ఒకప్పుడు ఆయన అంటే తనకి ఎంతమాత్రం నచ్చేది కాదంటూ షాక్ ఇచ్చింది.

రాజ్ తరుణ్ హీరోగా ఇటీవల 'అనుభవించు రాజా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ ఈ సినిమాను గురించి మాట్లాడుతూనే, రాజ్ తరుణ్ పట్ల తనకి కోపం రావడానికి గల కారణాన్ని ప్రస్తావించింది. "నిజం చెబుతున్నాను .. నాకు రాజ్ తరుణ్ అంటే ఒకప్పుడు అస్సలు నచ్చేవాడు కాదు. టీవీలో రాజ్ తరుణ్ సినిమా వస్తుంటే తీసేయమని చెప్పేదానిని. ఒకసారి రాజ్ తరుణ్ కారులో వెళుతుంటే, ఆయనకి యాక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో విరగాలని కోరుకున్నాను.

ఒకసారి ఇంటర్వ్యూ కోసం పిలిచారు .. ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ అన్నారు. కానీ మధ్యాహ్నం 1:30 .. 2:00 గంటలైపోయింది. అలా జగడంలో ఆయనకి సంబంధం లేదని ఆ తరువాత నాకు తెలిసింది. వేరే పనులు కూడా ఉండటంతో వెయిట్ చేయడం చాలా కష్టమైంది. అంతసేపు వెయిట్ చేయించిన ఆయన, కారులో నా కళ్ల ముందే వెళ్లిపోతున్నారు. అదేంటయ్యా అని అంటే, సార్ కి డబ్బింగ్ కరెక్షన్ ఉంది. అందుకోసమే వెళుతున్నారని చెప్పారు. మూడు గంటల పాటు వెయిట్ చేయించి అలా చేయడంతో నాకు చాలా కోపం వచ్చేసింది.

ఇక లైఫ్ లో రాజ్ తరుణ్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లకూడదని అనుకున్నాను. 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లడానికి ముందు నేను చేసిన లాస్ట్ ఇంటర్వ్యూ రాజ్ తరుణ్ దే. అంతగా రాజ్ తరుణ్ అంటే చిటపటలాడిన నేను నా ఫస్టు మూవీనే ఆయనతో చేయవలసి వచ్చింది. నాకు అసలే నచ్చని వ్యక్తితో నేను సినిమా చేయడం ఏమిటి? అనుకున్నాను. ఈ సినిమాలో నేను కనిపించేది చాలా తక్కువ సేపే అయినా, నాకు చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ తో కలిసి యాక్ట్ చేయడం మొదలు పెట్టిన రెండు రోజుల్లోనే ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు" అని చెప్పుకొచ్చింది.