ఆర్ యూ వర్జిన్? నెటిజన్ ప్రశ్నకు శృతి స్ట్రాంగ్ కౌంటర్..!

Fri Mar 17 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Are you a virgin? Shruti's strong counter to the netizen's question..!

ఇది సోషల్ మీడియా యుగం. ప్రతి ఒక్కరూ అందులో ఉంటున్నారు. దాని ద్వారానే కొత్త విషయాలు వార్తలు తెలుసుకుంటున్నారు. సెలబ్రిటీల విషయానికి వస్తే వారు తమ గ్లామర్ ప్రదర్శనలతో పాటు ఫ్యాన్స్ కు టచ్ లో ఉండేందుకు వారితో ముచ్చటించేందుకు వారిని మర్చిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఆస్క్ మీ అంటూ నెటిజన్లతో టచ్ లో ఉంటున్నారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానాలు ఇస్తున్నారు.శృతిహాసన్ కూడా ఇలాగే తనను ఏదైనా సిల్లీ ప్రశ్నలు అడగాలని ఓన్లీ సిల్లీ అంటూ నెటిజన్లను ఆడిగింది. ఇంకేముంది నెటిజన్లకు దొరికేందే ఛాన్స్ అనుకుంటూ రకరకాల ప్రశ్నలు అడిగారు. అందులో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న దానికి శృతి హాసన్ ఇచ్చిన జవాబు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శృతి ఆర్ యూ వర్జిన్ అంటూ నేరుగా అడిగేశాడు. దీంతో శృతిహాసన్ కు తిక్కరేగింది. ఆ వ్యక్తి అదే రేంజ్ లో సమాధానం చెప్పింది. ఆర్ యూ వర్జిన్ అని అడుగుతూ ఆ వ్యక్తి వర్జిన్ అనే స్పెల్లింగ్ ను తప్పుగా రాశాడు. దీంతో శృతిహాసన్ దానినే హైలెట్ చేస్తూ ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో అంటూ చెంప చెల్లుమనేలా జవాబు ఇచ్చింది.

అయితే శృతి హాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఇంకేదో మాట్లాడుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేయడం గమనార్హం. అంతకు ముందు మరో సోషల్ మీడియా యూజర్ నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను అని అడిగాడు. దానికి శృతిహాసన్ సింపుల్ గా నో అని చెప్పేసింది.

ప్రస్తుతం శృతిహాసన్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే శృతి.. తన బాయ్  ఫ్రెండ్ తో కలిసి దిగిన పిక్స్ వీడియోలు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటుంది. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లైవ్ చాటింగ్ లో పాల్గొంటుంది శృతిహాసన్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.