Begin typing your search above and press return to search.

ఆ సినిమాలకు టాలీవుడ్‌ లో కాలం చెల్లినట్లేనా?

By:  Tupaki Desk   |   15 Aug 2022 10:30 AM GMT
ఆ సినిమాలకు టాలీవుడ్‌ లో కాలం చెల్లినట్లేనా?
X
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమ గడ్డు కాలం ను ఎదుర్కొంటుంది. అయితే టాలీవుడ్ మాత్రం కాస్త ఊరటనిచ్చే విధంగా వసూళ్లను రాబట్టడంతో పాటు కొన్ని సినిమాలు సక్సెస్ అవుతూ ఇండస్ట్రీని బతికిస్తున్నాయి. హిందీతో పోల్చితే గత కొంత కాలంగా టాలీవుడ్‌ సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో టాలీవుడ్ లో కూడా చాలా అంచనాల నడుమ వచ్చిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

టాలీవుడ్‌ లో సక్సెస్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. మాస్ మసాలా సన్నివేశాలు.. భారీ యాక్షన్ సన్నివేశాలు.. హీరో ఎలివేషన్‌ సన్నివేశాలు సినిమాలో మూడు నాలుగు చొప్పున ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మినిమంగా ఆడటం ఖాయం అంటూ ఒప్పటి అభిప్రాయం. అలాంటి సినిమాలు టాలీవుడ్ లో అప్పట్లో బాగానే ఆడాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారి పోయింది.

కరోనా కారణంగా ఇండస్ట్రీ లో మార్పు రాలేదు కాని ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఈ మధ్య విడుదల అయిన సినిమా ల్లో సక్సెస్ సినిమాలను చూస్తే ఎక్కువ శాతం విభిన్నమైన కథతో రూపొందిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ప్రయోగాత్మక సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలకు వసూళ్లు వస్తున్నాయి.

గతంలో స్టార్‌ కాస్టింగ్‌ ఆధారంగా మాస్ ఎలిమెంట్స్ ఆధారంగా సినిమాలకు వసూళ్లు నమోదు అయ్యేవి. కాని ఇప్పుడు మాత్రం మాస్ ఎలిమెంట్స్ కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌ సినిమాలకు మాత్రమే వసూళ్లు నమోదు అవ్వడంతో టాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్‌ తమ పాత ఆలోచనలు మార్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

టాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో వచ్చిన మాచర్ల నియోజకవర్గం మరియు ది వారియర్ ఇంకా కొన్ని సినిమా లు భారీ అంచనాల నడుమ రూపొంది విడుదల అయ్యాయి. కాని అవేవి కూడా సక్సెస్ అవ్వలేదు. రెగ్యులర్ కమర్షియల్‌ సినిమాలు అయిన ఆ సినిమా లను ప్రేక్షకులు తిరష్కరించిన తీరు చూస్తుంటే టాలీవుడ్ లో మూస కమర్షియల్‌ సినిమాలకు కాలం చెల్లినట్లు అనిపిస్తుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో రూపొందిన సినిమా లు ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ వరకు వెళ్తున్నాయి. కనుక కాలం కాస్త విభిన్నంగా ఆలోచించి తెలుగు ఫిల్మ్ మేకర్స్‌ సినిమా లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుష్ప వంటి మాస్ కమ్‌ యూనిక్ సబ్జెక్ట్‌ లను తీసుకుంటే తప్ప కమర్షియల్‌ గా సినిమాలు ఆడటం కష్టం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.