బాలయ్య కోసం ఆ నలుగురు పోటీపడుతున్నారా?

Tue Nov 29 2022 23:00:02 GMT+0530 (India Standard Time)

Are those four competing for Balayya

సీనియర్ హీరోల్లో చిరు తరువాత నందమూరి బాలకృష్ణ జోరుగా సినిమాలు చేస్తున్నారు. `అఖండ` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన బాలయ్య అదే ఊపుతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ కర్నూల్ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న `వీరి సింహారెడ్డి`లో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.చాలా ఏళ్ల విరామం తరువాత బాలయ్య చేస్తున్న ఫ్యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా ఈ మూవీలో బాలయ్య డ్యుయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఓ పాత్రలో వీర సింహారెడ్డిగా మరో పాత్రలో బాల సింహారెడ్డిగా కనిపిస్తాడని తెలుస్తోంది. యంగ్ బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా తండ్రి పాత్రకు జోడీగా మలయాళ నటి హనీ రోజ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ లాల్ విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నారు.

2023 సంక్రాంతికి భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే లిరికల్ వీడియో `జై బాలయ్య`తో ప్రమోషన్స్ ని చిత్ర బృందం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే అనిల్ రావిపూడి మూవీ తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ పొలిటిక్ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే ఎన్నికలని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో ఏపీ రాజకీయాలపై సెటైరికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని చేయబోతున్నారట.

దీని కోసం ఇప్పటికే కథని బోయపాటి శ్రీను రెడీ చేశారని తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పవర్ ఫుల్ సెటైర్లతో సాగే ఈ మూవీని నిర్మించడం కోసం టాలీవుడ్ లో వున్న క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు పోటీపడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో `భీమ్లానాయక్`ని చేయాలనుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సితార వారితో 14 ప్లస్ రీల్స్ తో పాటు `అఖండ` నిర్మాత ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారట.

ఈ ముగ్గురితో పాటు మరో స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఇదే సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే ఈ నలుగురిలో బాలకృష్ణ ఏ ప్రొడ్యూసర్ కు ఛాన్స్ ఇవ్వనున్నాడన్నది ఇప్పటి వరకైతే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ రానుందని అప్పుడే ఏ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మిచేది తెలియనుందని ఇన్ సైడ్ టాక్.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.