`పుష్ప 2` కోసం భారీ స్కెచ్ ని రెడీ చేస్తున్నారా?

Sat Dec 03 2022 19:02:32 GMT+0530 (India Standard Time)

Are they preparing a huge paln for Pushpa 2

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా వండర్ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ దక్షిణ భారతంతో పాటు ఉత్తర భారతంలోనూ భారీ విజయాన్ని సాధించిన రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. గత ఏడాది డిసెంబర్ 17న హడావిడిగా ఎలాంటి ప్లాన్ లేకుండా కరోనా భయాల నేపథ్యంలో ఈ మూవీని రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న `పుష్ప 2`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాలని దృష్టిలో పెట్టుకుని కథలో భారీ మార్పులు చేయడమే కాకుండా బడ్జెట్ పరంగానూ దర్శకుడు సుకుమార్ మార్పులు చేసినట్టుగా గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 2 కోసం ఈ సారి రూ.350 కోట్లకు మించి ఖర్చు చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా బడ్జెట్ కు అనుగుణంగా సినిమా షూటింగ్ లోకేషన్స్ ని కూడా మార్చినట్టు చెబుతున్నారు.

ధాయ్ లాండ్ అడవుల్లో భారీ పులి ఫైట్ ని బన్నీపై చిత్రీకరించాని సుకుమార్ ఇప్పటికే ప్లాన్ చేసినట్టు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేసింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని డిసెంబర్ 8న బారీ స్థాయిలో రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం తాజాగా రష్యా రాజధాని మాస్కోకి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్ తో పాటు చిత్ర నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కూడా మాస్కో వెళ్లారు. అక్కడి మీడియాతో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్న చిత్ర బృందం అక్కడ `పుష్ప`ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. `పుష్ప 2` షూటింగ్ ని త్వరలో ప్రారంభించనున్న టీమ్ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి స్థాయిలో మొదలు పెట్టింది. చిత్ర బృందం మాస్కో నుంచి తిరిగి రాగానే `పుష్ప 2` ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని ఇండియాతో పాటు రష్యాలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.  

ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ వెల్లడించినట్టుగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా క్రేజ్ ని బట్టి మరి కొన్ని దేశాల్లోనూ ఇదే తరహాలో రిలీజ్ చేయాలని మైత్రీ వారు ప్లాన్ చేస్తున్నారట. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.