ఫోటోషూట్ల హోరు.. లేదే ఆఫర్ల జోరు!

Sat Apr 20 2019 16:18:47 GMT+0530 (IST)

Are Photoshoots Not Helping Eesha

ఈషా రెబ్బా పేరు తెలుగు సినీ ప్రేమికులకు తెలిసే ఉంటుంది. మన తెలుగు సినిమా హీరోయిన్ల లిస్టులో ఉన్న అచ్చతెలుగు భామ ఈషా ఒక్కతే.  మొదట్లో కాస్తో కూస్తో హిట్స్ సాధించిన ఈ భామ ఈమధ్య కెరీర్లో స్లో అయిపోయింది.  'అరవింద సమేత'లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తే కెరీర్లో ఊపు వస్తుందనుకుంటే ఆ పాత్ర అసలేమాత్రం ఈషా కెరీర్ కు ప్లస్ కాలేదు.  ఆ సినిమా తర్వాత సుమంత్ 'సుబ్రమణ్యపురం' రిలీజ్ అయింది. అది విడుదలై నాలుగు నెలలు అవుతున్నా ఇంకా కొత్త సినిమా స్టార్ కాలేదు.అలా అని ఈషా రెబ్బా అధైర్యపడే అమ్మాయి కాదు. ఫోటోషూట్ల మీద ఫోటో షూట్లు చేస్తూ తన హాట్ ఫోటోలతో గ్లామరసం చిందిస్తోంది. కానీ ఎంత కష్టపడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగు మేకర్ల కఠినమైన మనసు కరగడం లేదు.  ఈషాకు ఆఫర్లు ఇవ్వడం లేదు కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగా పరభాషల భామలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు మన ఫిలిం మేకర్లు. దీంతో ఈషా చేసే బ్యూటిఫుల్ ఫోటో షూట్లకు మాత్రం ఫలితం దక్కడం లేదు. అయినా అచ్చ తెలుగు హీరోయిన్లంటే మన ఫిలిం మేకర్లకు ఎందుకు అంత అలుసో ఎవరికీ అంతచిక్కడం లేదు.

ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అంజలి.. శ్రీదివ్య లాగా కొలీవుడ్ కో.. శాండల్ వుడ్ కో వెళ్లి సెటిల్ అయిపోతుందేమో.  తమిళులకు..కన్నడిగులకు  ఈషా పొరుగు ఇండస్ట్రీ అమ్మాయి కదా.. నెత్తిన పెట్టుకునే అవకాశం ఉంది.  అన్నట్టు ఈ భామ రీసెంట్ గా ఒక కన్నడ ఫిలిం సైన్ చేసిందట. అంటే ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలు పెట్టిందేమో!