బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్ అర్భాజ్ ఖాన్ తాజాగా ఒక కమర్షియల్ యాడ్ లో నటించాడు. కోడింగ్ కు సంబంధించిన కంపెనీ యొక్క ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో అర్భాజ్ ను టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గా చూపించే ప్రయత్నం చేశారు.
అర్భాజ్ ఈ యాడ్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వెంటనే చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. చాలా కాలం నుండి రోజర్ ఫెదరర్ గా అర్భాజ్ ఖాన్ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండేది. ఇద్దరిని జత చేసి గతంలో సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయడం జరిగింది.
తాజాగా అర్భాజ్ ఖాన్ ను ఈ కమర్షియల్ వీడియోలో రోజర్ ఫెదరర్ ని చూపించడం జరిగింది. ఆయనకు ఇమేజ్ ను వినియోగించుకుని యాడ్ ను రూపొందించిన వారు క్రియేటివ్ గా రోజర్ ఫెదరర్ మాదిరిగా అర్భాజ్ ఖాన్ ను చూపించడం జరిగింది. ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు మీమ్స్ తో విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు.
కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు ప్రశంసిస్తున్నారు. టెన్నిస్ గురించి తెలియకుండా.. టెన్నిస్ బ్యాట్ కూడా పట్టుకోవడం రాని వ్యక్తి అర్భాజ్ ఖాన్. ఇలాంటి వ్యక్తి రోజర్ ఫెదరర్ యొక్క గెటప్ లో కనిపించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఇది ఒక అద్భుతమైన యాడ్ అని.. ఈ ఏడాదిలోనే మేటి యాడ్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Code. Sleep. Legend. Repeat.
— Arbaaz Khan (@arbaazSkhan) February 6 2023
Collab with @SuperteamDAO pic.twitter.com/GyggEHaY6w