ప్రతి నెల ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని ప్రేక్షకుల అంచనాలు అందుకొని సూపర్ సక్సెస్ అవుతున్నాయి. మరికొన్ని డిజాస్టర్ కేటగిరి లోకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు బాగుంది అనే టాక్ తెచ్చుకున్న కూడా కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు. ఇక యావరేజ్ అనే టాక్ వస్తే ఆ మూవీ డిజాస్టర్ లిస్టులోకి వెళ్లిపోయినట్లు లెక్క.
సినిమా కథ ఎంతో బాగుంటే గాని థియేటర్స్ లో ప్రస్తుతం ఆడటం లేదు. అలాగే రొటీన్ కమర్షియల్ కథలపై ప్రేక్షకులు ఏమంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో దర్శకులు కూడా కొత్త కథలను చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డిఫరెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల డిఫరెంట్ జోనర్ లలో సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉండడం విశేషం.
అలాగే ఏప్రిల్ లో రిలీజ్ కాబోయే అన్ని సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్ చిత్రాలే కావడం విశేషం. ఏప్రిల్ 6న అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేశముదురు రీ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 7న రావణాసుర హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. అదే రోజు రిలీజ్ అవుతున్న కిరణ్ అబ్బవరం మీటర్ మూవీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కథాంశంతో సందడి చేయనుంది.
ఇక ఏప్రిల్ 14న సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న శాకుంతలం మైథలజికల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమాలు రుద్రుడు యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో సందడి చేయగా విజయ్ ఆంటోనీ బిచ్చగాడు మరో డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంది.
ఇక ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష కంప్లీట్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. ఇక ఏప్రిల్ 28న రిలీజ్ కాబోయే అఖిల్ ఏజెంట్ మూవీ కమర్షియల్ స్పై థ్రిల్లర్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులను అలరించబోతుంది.
అదే రోజు రిలీజ్ కాబోయే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 మూవీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇలా ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోయే సినిమాలు వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.